Begin typing your search above and press return to search.

ఆ నిర్మాతను గుర్తించండయ్యా..

By:  Tupaki Desk   |   22 April 2018 8:33 AM GMT
ఆ నిర్మాతను గుర్తించండయ్యా..
X
రెండున్నర దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నాడు నిర్మాత డీవీవీ దానయ్య. ఐతే ఆయన చాలా వరకు వేరే వాళ్ల భాగస్వామ్యంలోనే సినిమా తీశాడు. ఇంతకుముందు బాలాజీ ఆర్ట్స్ బేనర్లో భాగస్వామిగా ఉండేవాడు. భగవాన్.. పుల్లయ్యలతో కలిసి సినిమాలు తీసేవాడు. ఆ తర్వాత వారి నుంచి విడిపడి యూనివర్శల్ మీడియా బేనర్లో కొన్ని సినిమాలు తీశాడు. అప్పుడు ‘హారిక హాసిని క్రియేషన్స్’ అధినేత ఎస్.రాధాకృష్ణ కూడా ఆయనతో కలిసుండేవాడు. ఆయన తర్వాత వేరుపడి నిర్మాతగా చాలా పెద్ద స్థాయికి ఎదిగిపోయాడు. ఐతే దానయ్యకు నిర్మాతగా తనకంటూ వ్యక్తిగత గుర్తింపు పెద్దగా రాలేదు. ఇలాంటి తరుణంలో ‘భరత్ అనే నేను’ లాంటి భారీ ప్రాజెక్టును టేకప్ చేశాడు దానయ్య.

భారీ ఖర్చుతో ఏమాత్రం రాజీ లేకుండా ఈ చిత్రాన్ని నిర్మించాడు దానయ్య. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. భారీ వసూళ్లూ వస్తున్నాయి. ఐతే అందరూ మహేష్ బాబు.. కొరటాల శివల గురించి మాట్లాడేవాళ్లే కానీ.. నిర్మాత గురించి పెద్దగా చర్చ లేదు. ఐతే యువి క్రియేషన్స్ వాళ్లో.. మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లో.. దిల్ రాజో.. అల్లు అరవిందో ఈ సినిమాను నిర్మించి ఉంటే వాళ్లకు ఎంత పేరొచ్చేదో. దానయ్య డబ్బులు పెడతారు.. ఏం కావాలంటే అది సమకూరుస్తారు కానీ.. తన సినిమాల ప్రొడక్షన్లో పెద్దగా జోక్యం చేసుకోరని పేరుంది. అయినప్పటికీ ఇలాంటి భారీ సినిమాలు నిర్మిస్తున్నపుడు ఆయన క్రెడిట్ ఆయనకివ్వాల్సిందే. ఆయన ప్రస్తుతం రామ్ చరణ్-బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. దాని తర్వాత ఎన్టీఆర్-చరణ్ కాంబినేషన్లో రాజమౌళి తీయబోయే మల్టీస్టారర్‌ ను ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. ఈ సినిమాలు వచ్చాక దానయ్య పేరు మార్మోగడం ఖాయం.