Begin typing your search above and press return to search.

ఆర్ ఆర్ ఆర్ బడ్జెట్ 400 కోట్లా ?

By:  Tupaki Desk   |   14 March 2019 7:38 AM GMT
ఆర్ ఆర్ ఆర్ బడ్జెట్ 400 కోట్లా ?
X
షూటింగ్ మొదలుపెట్టక ముందు నుంచే అంచనాలు ఆకాశాన్ని దాటేసిన ఆర్ ఆర్ ఆర్ బడ్జెట్ ఎంతవుతుంది అనేదాని గురించి చాలా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి వాటి వివరాలు నిర్మాతలు బయట పెట్టరు. కాని దానికి భిన్నంగా నిర్మాత డివివి దానయ్య స్టేజి మీద 350 నుంచి 400 కోట్ల దాకా ఆర్ ఆర్ ఆర్ బడ్జెట్ అవ్వబోతోందని చెప్పి అందరిని షాక్ కు గురి చేశారు. మరి బిజినెస్ ఎంత ఆశిస్తున్నారు అనే ప్రశ్నకు మాత్రం అది ఇప్పుడే ఎలా చెప్తాం ఫైనల్ గా అన్ని పూర్తయ్యాక వెల్లడి చేస్తాను అని చెప్పడం గమనార్హం,

వివిధ బాషల్లోకి అనువాదం చేయమని ఒత్తిడి వస్తోందని ప్రస్తుతానికి తెలుగు - తమిళ్ - హింది - కన్నడ - మలయాళం కలిపి మొత్తం 10 బాషల్లోకి ఆర్ ఆర్ ఆర్ విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని వచ్చే ఏడాది రిలీజ్ డేట్ లోపు ఈ సంఖ్యలో పెరుగుదల ఉండొచ్చని చెప్పారు. ఇంత భారీ బడ్జెట్ తో తెలుగులో ఇప్పటి దాకా ఏ సినిమా రూపొందలేదు.

సౌత్ లో ఈ విషయంగా 2.0 పేరు మీద రికార్డు ఉంది. అయితే దానికి తగ్గ విజయాన్ని అది అందుకోలేదు. పైగా అంత బడ్జెట్ తెరమీద కనిపించే స్థాయిలో సినిమా లేదనే కామెంట్స్ మధ్య 2.0 లాస్ వెంచర్ గానే మిగిలింది. కాని ఆర్ ఆర్ ఆర్ కు దానికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మూవీ కావడంతో డిమాండ్ ఓ రేంజ్ లో ఉంది.

ఇప్పటికిప్పుడు సినిమాను అమ్మేసినా మొత్తం పెట్టుబడికి డబుల్ త్రిబుల్ వచ్చేలా ఉంది. అందుకే దానయ్య అంత ధీమాగా పబ్లిక్ స్టేజి మీద అది కూడా ప్రెస్ తోనే ఆర్ ఆర్ ఆర్ 400 కోట్ల దాకా అవుతుందని చెప్పినట్టు ఉన్నారు. మొత్తానికి ప్రెస్ మీట్ తో బోలెడు విశేషాలు మూటగట్టుకున్న ఆర్ ఆర్ ఆర్ ఇప్పటిదాకా ఒక లెక్క ఇకపై ఒక లెక్క అనేలా అంచనాలు పెంచేసిన మాట వాస్తవం