Begin typing your search above and press return to search.

100 కోట్ల డీల్ తృణ‌ప్రాయంగా!?

By:  Tupaki Desk   |   20 Oct 2018 5:59 AM GMT
100 కోట్ల డీల్ తృణ‌ప్రాయంగా!?
X
భారీ క్రేజ్‌ తో వ‌చ్చే సినిమాల‌కు చాలా ముందే భారీ ఆఫ‌ర్లు క్యూ క‌డుతుంటాయి. టాలీవుడ్‌ లో ఈ రేంజు ఓ అర‌డ‌జ‌ను హీరోల‌కు ఉంది. ప‌వ‌న్‌ - మ‌హేష్‌ - ఎన్టీఆర్‌ - రామ్‌ చ‌ర‌ణ్‌ - ప్ర‌భాస్ చిత్రాల్ని బ‌య్య‌ర్లు చాలా ముందే కొనేసేందుకు ప్రిపేర‌వుతున్నారు. ప‌వ‌న్ అజ్ఞాత‌వాసి - ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ చిత్రాల‌కు రిలీజ్ ముందే 100కోట్ల ఆఫ‌ర్ వెతుక్కుంటూ వ‌చ్చింద‌ని ఇదివ‌ర‌కూ ముచ్చ‌టా సాగింది.

అదంతా అటుంచితే.. తాజాగా అలాంటి ఆఫ‌ర్ నిర్మాత దాన‌య్య‌కు వ‌చ్చిందిట‌. ఎస్.ఎస్‌.రాజ‌మౌళి- దాన‌య్య కాంబినేష‌న్‌ లో తెర‌కెక్క‌నున్న భారీ బ‌డ్జెట్ మ‌ల్టీస్టార‌ర్‌ ఆర్ ఆర్ ఆర్ కు బాహుబ‌లి నిర్మాత‌లు శోభు - ప్ర‌సాద్ దేవినేనిలు వంద కోట్ల ఆఫ‌ర్ ఇచ్చార‌న్న ముచ్చ‌టా సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ ఇంకా ప‌ట్టాలెక్క‌కుండానే ఇంత భారీ మొత్తం ఆఫ‌ర్ చేస్తే డివివి దాన‌య్య వ‌ద్ద‌నుకున్నార‌న్న మాటా ఫిలిం స‌ర్కిల్స్‌ లో వినిపిస్తోంది.

అయితే ఈ వార్త‌లో నిజం ఎంతో తెలీదు కానీ, 2019 జ‌న‌వ‌రిలో సినిమాని ప్రారంభించి - 2020లో రిలీజ్ చేసేందుకు రాజ‌మౌళి ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నార‌ని తెలుస్తోంది. ఈ చిత్రానికి దాన‌య్య 300కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నార‌ని - తెలుగు - త‌మిళ్‌ - హిందీలో ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌ ని నిర్మిస్తార‌ని అప్ప‌ట్లో ప్ర‌చార‌మైంది. దీనిని బ‌ట్టి 100కోట్ల ఆఫ‌ర్ కేవ‌లం తెలుగు వెర్ష‌న్ రిలీజ్ కోస‌మేనా? అన్న చ‌ర్చా మొద‌లైంది. 300కోట్ల బ‌డ్జెట్ పెడితే క‌నీసంగా 500కోట్ల బిజినెస్ చేయాల‌ని నిర్మాత ఆలోచించ‌డం స‌హ‌జం. ఆ క్ర‌మంలోనే ఆర్‌.ఆర్‌.ఆర్ ప్రాజెక్టుపై అంత‌కంత‌కు అంచ‌నాలు పెరుగుతున్నాయి.