Begin typing your search above and press return to search.
నష్టాల్లో వాటా తీసుకున్న మెగా ప్రొడ్యూసర్
By: Tupaki Desk | 26 Nov 2015 10:48 AM GMTఎన్నో అంచనాలతో వచ్చి దసరా పండక్కి వచ్చిన రామ్ చరణ్ బ్రూస్ లీ అంచనాలను అందుకోలేకపోయాడు. ఫైటర్ ని టైటిల్ లోనే పెట్టుకున్నా... కలెక్షన్ ఫైట్ లో మాత్రం ఓడిపోయాడు. మరోవైపు ఈ చిత్రాన్ని భారీ రేట్లకు విక్రయించడంతో.. 42 కోట్లకు విక్రయించినా డిస్ట్రిబ్యూటర్ లకు నష్టాలు తప్పలేదు. ఈ నష్టాల్లో కొంత బ్రూస్ లీ నిర్మాత భరిస్తాడనే వార్తలు కొన్నాళ్లుగా వస్తున్నా ఎవరూ నోరు మెదపలేదు.
మరోవైపు ఈ చిత్రానికి వచ్చిన లాస్ 30శాతం లోపే ఉండడంతో.. తిరిగి ఇవ్వకపోవచ్చనే అంచనాలు కూడా పెరిగాయి. అయితే.. బ్రూస్ లీ నిర్మాత దానయ్య మాత్రం డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు. ఈ చిత్రాన్ని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజుకు కొంత నష్టపరిహారం అందించాడు. ఐదు కోట్లకు పైగా నష్టం వాటిల్లడంతో.. అందులో రెండున్నర కోట్లను తిరిగిచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన ఏరియాల బయ్యర్లు - డిస్ట్రిబ్యూటర్లతోనూ టాక్స్ నడుస్తున్నాయట. మన ఇండస్ట్రీలో భారీ చిత్రాలను అమ్మేశాక నష్టాల గురించి పట్టించుకున్నవాళ్లు అత్యంత అరుదు అనే చెప్పాలి. బడా ప్రొడ్యూసర్లుగా పేరు పొందిన ఎంఎస్ రాజు - బెల్లంకొండలు.. నష్టాలను పట్టించుకోక పోవడంతో తర్వాత మూవీస్ పై ఎఫెక్ట్ పడిందంటారు.
కానీ దానయ్య మాత్రం తన నెక్ట్స్ మూవీస్ కి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం., కాస్త లిబరల్ గానే ప్రవర్తించారని చెప్పాలి. ఎందుకంటే అంకెల పరంగా ఎక్కువగా ఉన్నా.. పర్సెంటేజ్ ప్రకారం చూస్తే ఒక రూపాయి కూడా వెనక్కి ఇవ్వక్కర్లేదని చాలామంది చెప్పారు దానయ్యకి. అయితే ఆయన మాత్రం ఎంతోకొంత వెనక్కి ఇవ్వడానికే నిర్ణయించుకుని, ఆమేరకు పేమెంట్స్ చేస్తుండడంతో.. నిర్మాతగా నాలుగు మెట్లు ఎక్కేసినట్లయింది.