Begin typing your search above and press return to search.

డ‌బ్బులు ఎవ‌రికీ తిరిగివ్వ‌డం లేదు

By:  Tupaki Desk   |   13 Nov 2015 6:07 AM GMT
డ‌బ్బులు ఎవ‌రికీ తిరిగివ్వ‌డం లేదు
X
సినిమా ఫ్లాపైతే న‌ష్ట‌పోయేది ఎవ‌రు? నిర్మాత‌ - డిస్ర్టిబ్యూట‌ర్‌ - బ‌య్య‌రు - ఎగ్జిబిట‌రు.. ఈ ప్రశ్నకు వేస్తే ఎవ‌రైనా స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా? కాస్త క‌ష్ట‌మే. అయితే స్టార్ హీరోల‌తో సినిమాలు తీసే ఏ నిర్మాతా న‌ష్ట‌పోడు. ఐతే గియితే అత‌డిని న‌మ్ముకున్న ఎగ్జిబిట‌ర్లు - బ‌య్య‌ర్లు న‌ష్ట‌పోవాల్సిందే త‌ప్ప నిర్మాత‌ల‌కు ఇంచు కూడా కాదు ... అని స్టాటిస్టిక్స్ చెబుతుంటారు ట్రేడ్ పండితులు. కానీ బ్రూస్‌ లీ విష‌యంలో ఈ స్టాటిస్టిక్స్‌ ని మించి ఇంకేదో మాయాజాలం జ‌రిగింద‌న్న‌ది తాజా అప్‌ డేట్‌. ఈ సినిమా విష‌యంలో నిర్మాత న‌ష్ట‌పోలేదు. పంపిణీదారులు న‌ష్ట‌పోలేదు. పోయింద‌ల్లా సినిమాని మిగ‌తావాళ్ల‌నుంచి కొనుక్కున్న ఎగ్జిబిట‌ర్లు - థ‌ర్డ్ పార్టీ బ‌య్య‌ర్లేన‌ని విశ్లేషిస్తున్నారు.

రామ్‌ చ‌ర‌ణ్ హీరోగా శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బ్రూస్‌ లీ మొద‌టిరోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినా దాదాపు 40కోట్ల షేర్ వ‌సూలు చేసి సంచ‌ల‌నం న‌మోదు చేసింది. జ‌నాల దృష్టిలో ఈ సినిమా ఫ్లాప్ అయినా .. నిర్మాత‌ల‌కేం న‌ష్టం లేదు. సినిమా బాలేదు. బ్యాడ్ కంటెంట్ అంటూ ద‌ర్శ‌కుడిని ప‌రేషాన్ చేశారు. కానీ చ‌ర‌ణ్ ఇమేజ్ వ‌ల్ల డ‌బ్బుల ప‌రంగా భారీగా న‌ష్ట‌పోయిందేం లేదు. ఐతే గియితే ఓవ‌ర్సీస్ లో రిలీజ్ చేసిన‌వాళ్ల‌కు కొంత‌వ‌ర‌కూ న‌ష్టాలొచ్చాయ‌ని చెబుతున్నారు. వీళ్ల‌లో కూడా కొంద‌రు తెలివైన డిస్ర్టిబ్యూట‌ర్లు థ‌ర్డ్ పార్టీల‌కు అమ్మ‌కాలు సాగించి చేతులు దులిపేసుకున్నారు. అయితే ఇలా న‌ష్టాలు వ‌చ్చిన‌వారికి బ్రూస్‌ లీ నిర్మాత డివివి దాన‌య్య తిరిగి డ‌బ్బు చెల్లిస్తున్నాడంటూ వార్త‌లొచ్చాయి. వాటిని దాన‌య్య ఈజీగా కొట్టిపారేశారు. డ‌బ్బులు తిరిగి వెన‌క్కి ఇచ్చే సీన్ లేద‌న్నారు.

అయితే ఇంట్రెస్టింగ్‌ గా చ‌ర‌ణ్ న‌టిస్తున్న‌త‌దుప‌రి చిత్రం త‌ని ఒరువ‌న్‌ కి దాన‌య్య ఒక నిర్మాత‌గా కొన‌సాగుతున్నారు. మ‌ళ్లీ సేమ్ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు సినిమా అమ్మాలంటే అంతే సంగ‌తి. కాబ‌ట్టి ఇప్పుడు కొత్త వాళ్ల‌ను వెతుక్కుంటున్నార‌ని, మార్కెటింగ్‌ లో కొత్త స్ర్టాట‌జీని క‌నిపెట్టార‌ని ముచ్చ‌టించుకుంటున్నారు.