Begin typing your search above and press return to search.
OG: అంచనాలు పెంచేస్తున్న డీవీవీ ఎంటర్టైన్మెంట్స్
By: Tupaki Desk | 26 March 2023 3:29 PM GMTపవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేస్తున్న అన్ని సినిమాలు మీద ప్రేక్షకుల తో పాటు ఆయన అభిమానుల్లో అయితే విపరీతమైన ఆసక్తి నెలకొంది. అయితే ఎవరు ఊహించని విధంగా సాహూ సినిమా డైరెక్టర్ సుజీత్ సింగ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అప్పట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏర్పాటు చేసిన మీటింగ్లో సుజిత్ చెప్పిన కథ పవన్ కళ్యాణ్ కు నచ్చడంతో తర్వాత రోజు లంచ్ కి పిలిచి మరి పవన్ కళ్యాణ్ సుజిత్ ని చాలా ఆప్యాయంగా చూసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ నేపథ్యంలో ఈ సినిమా ప్రారంభం అవ్వడానికి చాలా కాలం పడుతుందని అందరూ అనుకున్నారు.
కానీ ఇప్పుడు తాజాగా ఈ సినిమాని నిర్మిస్తున్నట్లుగా ప్రకటించిన డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఒక అప్డేట్ షేర్ చేసింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ షేర్ చేసిన అప్డేట్ ప్రకారం డైరెక్టర్ సుజీత్ సింగ్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ రవిచంద్రన్ తో కలిసి ప్రొడక్షన్ డిజైనర్ ప్రకాష్ ఈ సినిమాకి సంబంధించిన లొకేషన్ ల వేటలో పడినట్లుగా తెలుస్తోంది.
తాజాగా షేర్ చేసిన ఫోటోల ప్రకారం సముద్రం భూమి ఏకమవుతున్న ప్రదేశంలో ఈ సినిమా లొకేషన్ లో కోసం వెతుకుతున్నట్లుగా అర్థమవుతుంది. ఈ టీం ప్రస్తుతం ముంబైలో ఉన్నట్టుగా ఫోటోలు బట్టి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా పేరుని ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అని సంబోధిస్తున్నారు కానీ ఇది వర్కింగ్ టైటిల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఎందుకంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో డీవీవీ దానయ్య ఈ విషయం మీద స్పందిస్తూ ప్రస్తుతానికి ఇంకా టైటిల్ అనుకోలేదని టైటిల్ అనుకున్న తర్వాత ఈ విషయం మీద క్లారిటీ ఇస్తామని చెప్పుకొచ్చారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ సుజిత్ సినిమా మీద ఒక్కొక్క అప్డేట్ తో అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తుంది డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ.