Begin typing your search above and press return to search.

ఆమె కాలా వైఫ్ అయితే.. హ్యూమా?

By:  Tupaki Desk   |   11 Jun 2017 9:37 AM GMT
ఆమె కాలా వైఫ్ అయితే.. హ్యూమా?
X
త‌మిళ సూప‌ర్ స్టార్ సినిమా అంటూ ఆ మేనియానే వేరు. ర‌జ‌నీతో సినిమా అనుకున్న నాటి నుంచి సినిమా విడుద‌ల‌య్యే వ‌ర‌కూ ఆ సినిమా మీద జ‌రిగే చ‌ర్చ అంతా ఇంతా కాదు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రం కాలా. ఈ మ‌ధ్య‌నే ముంబ‌యి షెడ్యూల్‌ ను పూర్తి చేసుకొని చెన్నైకి చేరుకున్నారు.

ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ తోనే కాలా మీద అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. ఈ మూవీలో ర‌జ‌నీ స‌ర‌స‌న బాలీవుడ్ న‌టి హ్యుమా ఖురేషి న‌టించే ఛాన్స్ కొట్టేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ర‌జ‌నీ భార్య‌గా మ‌రొక‌రు న‌టిస్తున్న‌ట్లు చెబుతున్నారు. పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ మూవీలో త‌లైవాకు భార్య‌గా ప్ర‌ముఖ న‌టి ఈశ్వ‌రీ రావ్ న‌టించ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఈశ్వ‌రీరావ్ ను ఎంపిక చేసిన‌ట్లుగా చెప్ప‌టంతో.. కాలా మూవీ క‌థ‌పై కొత్త వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఈశ్వ‌రీ రావును ఎంపిక చేశారంటే.. కాలా జీవితంలో ఆమెను పెళ్లి చేసుకొని.. ఆ త‌ర్వాత హ్యుమా ఖురేషి పాత్ర ఉంటుందా? అన్న సందేహం వినిపిస్తోంది. ర‌జ‌నీ అల్లుడు ధ‌నుష్ నిర్మిస్తున్న ఈ మూవీని 2018లో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. ధ‌నుష్ వండ‌ర్ బార్ బ్యాన‌ర్ మీద న‌టిస్తున్న ఈ మూవీలో ఈశ్వ‌రి రోల్ గురించి మ‌రో వాద‌న కూడా వినిపిస్తోంది. హ్యుమాతో ల‌వ్ బ్రేక్ అయి.. త‌ర్వాతి కాలంలో ఈశ్వ‌రిని చేసుకుంటారా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మొత్తానికి కాలాకు సంబంధించి ఒక కొత్త‌ క్యారెక్ట‌ర్ బ‌య‌ట‌కు రావ‌డంతో జ‌నం క‌థ ను కొత్త‌కొత్తగా ఊహించుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/