Begin typing your search above and press return to search.

బాద్ షాకు ఈడీ షాక్

By:  Tupaki Desk   |   25 March 2017 10:05 AM GMT
బాద్ షాకు ఈడీ షాక్
X
బాలీవుడ్ బాద్ షా - కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ ఐపీఎల్ జట్టు యుజమాని షారూక్‌ ఖాన్‌ కు ఎన్‌ ఫోర్స్‌ వెుంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్‌ లో రూ. 73.6 కోట్ల రూపాయుల విదేశీ మారక ద్రవ్యానికి నష్టం కలిగించిని కేసులో ఆయనకు ఈ నోటీసులు అందాయి. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కింద నవెూదెన కేసులో షారూక్‌ తోపాటు అతని భార్య గౌరీఖాన్‌ - నైట్‌ రైడర్స్‌ సహ యజమాని నటి జూహీచావ్లాకు కూడా నోటీసులు అందాయి.

నైట్ రైడర్స్ జట్టు షేర్లను మారిష్‌సకు చెందిన ఓ సంస్థకు అసలు ధర కంటే తక్కువ రేటుకు విక్రయించారని, దాంతో 73.6 కోట్ల మేరకు నష్టం కలిగిందని ఈ నోటీసులో ఈడీ ప్రస్తావించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు పదిహేను రోజుల గడువు ఇచ్చింది. 2008-09లో నమోదైన ఈ కేసులో ఇంతకుముందు కూడా షారూక్ కు గతంలోనూ నోటీసులు జారీచేశారు.

షారూక్‌కు చెందిన రెడ్‌ చిల్లీస్ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిడ్‌ (ఆర్‌సీఈపీఎల్‌).. బెర్ముడాలోని రెడ్‌ చిల్లీస్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థ. దీనికి షారూఖ్ భార్య గౌరీఖాన్‌ సహ యుజమాని. 2008లో ఐపీల ఫ్రాంచైజీ కోల్‌కతా జట్టు హక్కులు పొందే ప్రత్యేక ఉద్దేశంలో నైట్‌ రైడర్సు స్పోర్ట్స్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. ఆరంభంలో నైట్‌ రైడర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మొుత్తం షేర్లు రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, గౌరికే ఉన్నాయిు. ఐపీల్‌ సక్సెస్‌ నేపథ్యంలో అదనంగా రెండు కోట్ల షేర్లను ఇష్యూ చేసి.. ఇందులో 50 లక్షల షేర్లను మారిసష్ కు చెందిన ఓ కంపెనీకి.. 40 లక్షల షేర్లు జూహీ చావ్లాకు బదలాయించారు. వీటి ధర రూ.10గా పేర్కొన్నా వాస్తవ ధర ఎక్కువగా ఉందన్నది ఈడీ అభియోగం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/