Begin typing your search above and press return to search.
సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టిందా...?
By: Tupaki Desk | 6 Aug 2020 12:30 PM GMTబాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యులు అతన్ని ఆర్థికంగా మోసం చేసి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి ఉంటారని సుశాంత్ తండ్రి కృష్ణ కుమార్ సింగ్ ఆరోపిస్తూ పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పోలీసులు నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ ఆధారంగా నిందితులపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. ఇప్పటికే రియా చక్రవర్తిని ఆగస్టు 8న తమ ముందు హాజరుకావాలని సమన్లు జారీ చేసినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కాగా ఈడీ ఇప్పటికే సుశాంత్ బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్స్ తో పాటు అతనికి చెందిన వివిడ్రేజ్ రియాలిటీఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఫ్రంట్ ఇండియా ఫర్ వరల్డ్ ఫౌండేషన్ అనే రెండు కంపెనీల వివరాలు కూడా సేకరించిందని సమాచారం. ఈ రెండు సంస్థలకు రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి డైరెక్టర్స్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా రియాకి సంబంధిచిన అకౌంట్స్ తనిఖీ చేయగా ఆమె పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసినట్లు నేషనల్ మీడియా తెలిపింది. అందులోనూ ఈడీ రియాను వెంటనే హాజరు కావాలని సమన్లు జారీ చేయడంతో ఈ వార్తలు నిజమేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక రియా చక్రవర్తి ఆమెపై కేసు నమోదు అయినప్పటి నుంచి అజ్ఞాతంలో ఉంది. మరి ఈడీ ముందు హాజరవడానికి ఆమె బయటకి వస్తుందేమో చూడాలి.