Begin typing your search above and press return to search.

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: రకుల్ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసిన ఈడీ..!

By:  Tupaki Desk   |   2 Sep 2021 11:30 AM GMT
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: రకుల్ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసిన ఈడీ..!
X
టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ చట్టం కింద సెప్టెంబర్ 6న ఆమె విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొంది. అయితే ఈ విచారణకు మరికొంత గడువు కావాలని ఈడీ అధికారులను ఓ లేఖ ద్వారా రకుల్‌ ప్రీత్‌ అభ్యర్థించారు.

షూటింగులతో బిజీగా ఉండటం వల్ల తాను ఇప్పుడే విచారణకు హాజరు కాలేనని.. కొంత గడువు కావాలని ఈడీని రకుల్ ప్రీత్ సింగ్ కోరారు. అయితే రకుల్ రిక్వెస్ట్‌ ను ఈడీ అధికారులు రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. నోటీసులలో పేర్కొన్న ప్రకారం సెప్టెంబర్ 6న విచారణకు హాజరు కావాల్సిందేనని ఈడీ స్పష్టం చేసింది.

కాగా, నాలుగేళ్ళ క్రితం నాటి డ్రగ్స్ కేసు ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. అయితే అప్పుడు ఎక్సైజ్ అధికారులు జరిపిన విచారణలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు లేదు. కానీ ఇప్పుడు ఈడీ ఎంక్వైరీలో ఆమె పేరు బయటకు రావడం గమనార్హం. ఏదేమైనా ఎక్సైజ్‌ అధికారులు క్లీన్‌ చీట్‌ ఇచ్చిన డ్రగ్స్ కేసులో.. మనీలాండరింగ్ జరిగి ఉండొచ్చనే కోణంలో ఈడీ సీరియస్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్‌ దాదాపు 11 గంటల పాటు ఈడీ విచారించింది. డ్రగ్స్‌ కేసులో ఈరోజు శుక్రవారం నటి ఛార్మీ కౌర్ ని అధికారులు విచారిస్తున్నారు. ఉదయం నుంచి ఈ విచారణ కొనసాగుతోంది. డ్రగ్ పెడ్లర్ కెల్విన్‌ మొబైల్ లో ఛార్మి పేరు ఉండటంతో వీరి మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగాయనే కోణంలో ఈడీ ప్రశ్నలు సంధించనుంది. ఈ నేపథ్యంలో ఆమె బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మనీ లాండరింగ్‌ చట్టం కింద 12 మందికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆగస్టు 31న పూరీ జగన్నాథ్‌ - ఈరోజు (సెప్టెంబర్‌ 2) ఛార్మి ఈడీ ఎదుట హాజరయ్యారు. ఇక సెప్టెంబర్ 6న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ - 8న రానా దగ్గుబాటి - 9న రవితేజ మరియు అతడి డ్రైవర్ శ్రీనివాస్‌ - 13న నవదీప్‌ తోపాటు ఎఫ్‌-క్లబ్‌ మేనేజర్‌ - 15న ముమైత్‌ ఖాన్‌ - 17న తనీష్ - 20న నందు - 22న తరుణ్‌ ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు.