Begin typing your search above and press return to search.
కోట్ల స్కాం…బాలీవుడ్ హీరోయిన్ భర్త కి ఈడీ షాక్
By: Tupaki Desk | 9 Oct 2021 12:32 PM GMTరూ. 200కోట్ల మేర మోసం కేసులో బాలీవుడ్ హీరోయిన్ లీనా మరియా పాల్, ఆమె భర్త సుకేశ్ చంద్రశేఖర్ కు ఈడీ రులక్ ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ జంటను ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్ట్ చేసింది. అనంతరం వారి ఢిల్లీ కోర్టుముందు హాజరుపర్చింది. వీరికి 14 రోజుల రిమాండ్ విధించాలని కోరింది. గతంలో ఈ దంపతులను ఈడీ అనేక సందర్బాల్లో విచారించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మూవీ మద్రాస్ కేఫ్ లో నటించిన లీనా, తన భర్త సుకేశ్ చంద్రశేఖర్ జైల్లో ఉండగా స్పూఫ్ ఫోన్ కాల్ ద్వారా ఒక కేంద్ర ప్రభుత్వ అధికారిలా నటిస్తూ ఒక వ్యాపారవేత్త భార్య నుండి 200 కోట్ల రూపాయలు దోచుకున్నట్టు ఆరోపణలు నమోదైనాయి.
ఈ వ్యవహారంలో ఆమెతో కుమ్మక్కయ్యారంటూ అనేక మంది జైలు, బ్యాంకు అధికారులు కూడా అడ్డంగా బుక్కయ్యారు. ఈ కేసు దర్యాప్తులో ఈడీకి గట్టి ఆధారాలు లభించడంతో చంద్రశేఖర్ భార్య లీనాను ఢిల్లీ పోలీసులు కూడా అరెస్టు చేశారు. ఇటీవల చెన్నైలోని వీరి బంగ్లాపై నిర్వహించిన దాడుల్లో కోట్ల రూపాయల విలువైన వస్తువులను, అంతర్జాతీయ బ్రాండ్ల ఖరీదైన దుస్తులు, 16 వాహనాలను స్వాధీనం ఈడీ చేసుకుంది. సుకేశ్ అక్రమంగా సంపాదించిన డబ్బులతో లీనా లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నట్టు ఈడీ భావించింది. అలాగే ఈ రాకెట్‌లో ప్రధాన నిందితుడు సుకేశ్ కు సహకరించిన దీపక్ రామ్ దానీ, ప్రదీప్ రమణిలను ఈడీ అరెస్టుచేసింది. సుకేష్ సూచనల మేరకు వ్యాపారవేత్త భార్య నుండి అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ అధికారులు వెల్లడించారు. జూన్ 2020 నుండి మే 2021 మధ్య, ఈ జంట దాదాపు 40 సార్లు మోసానికి పాల్పడినట్టు ఈడీ గతంలొ పేర్కొంది.
200 కోట్ల స్కామ్ లో లీనా పాత్ర కూడా ఉందన్న నేపథ్యం లో ఆమెను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సుకేశ్… జైలు లో ఉండి… లీనాతో అన్ని వ్యవహరాలు నడిపిస్తున్నాడు. సుకేశ్ సుమారు 200 కోట్ల మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పలు బ్యాంకులు మరియు ఇతర స్కాంల్లో భాగంగా సుకేష్ ను గతంలో అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సుకేష్ తీహార్ జైలు లో ఉన్నాడు. అయితే, తాజాగా సుకేష్ తో లీనా కు సంబంధాలు ఉండటంతో ఆమెను అరెస్ట్ చేశారు. ఇక కేసు విషయాలు తెలియాల్సి ఉంది. 2013 ఏడాదిలో తన ప్రియుడితో కలిసి ఓ బ్యాంకును మోసం చేసిన కేసులో అరెస్ట్ కాగా.. మరోసారి 2015 లో అరెస్ట్ అయ్యారు. లీనా… జాన్ అబ్రహంతో కలిసి మద్రాస్ కేఫ్ లో నటించింది. ఇంకా అనేక బాలీవుడ్ సినిమాల్లో లీనా నటించి మంచి విజయాలు సాధించింది.