Begin typing your search above and press return to search.

'శ్యామ్ సింగ రాయ్' నుంచి బ్యూటీఫుల్ మెలోడీ.. ‘ఎదో ఎదో’..!

By:  Tupaki Desk   |   25 Nov 2021 3:24 PM GMT
శ్యామ్ సింగ రాయ్ నుంచి బ్యూటీఫుల్ మెలోడీ.. ‘ఎదో ఎదో’..!
X
ఇటీవల 'టక్ జగదీష్' చిత్రాన్ని విడుదల చేసిన నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు ''శ్యామ్ సింగ రాయ్'' అనే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ముమ్మరం చేసిన మేకర్స్.. తాజాగా 'ఎదో ఎదో' అనే పాటను విడుదల చేశారు.

'ఎదో ఎదో.. తెలియని లోకమా.. ఏదో ఏదో తహతహ మైకమా..' అంటూ సాగిన ఈ గీతం శ్రోతలను అలరిస్తోంది. ఈ సాంగ్ కు మెలోడీ సాంగ్స్ స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ ఫ్రెష్ ట్యూన్ కంపోజ్ చేశారు. ప్రేమికుడు పక్కన ఉంటే ప్రేయసి ఎలాంటి అనుభూతి చెందుతుందో.. ఆమె మనుసులోని భావాలను తెలియజేసేలా గేయ రచయిత కృష్ణ కాంత్ సాహిత్యం రాశారు. చైత్ర అంబడిపూడి వినసొంపుగా ఆలపించారు. నాని - హీరోయిన్ కృతి శెట్టి లపై చిత్రీకరించిన ఈ పాటలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. చివర్లో లిప్ లాక్ సీన్స్ సాంగ్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - 'రైజ్ ఆఫ్ శ్యామ్' సాంగ్ - టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా వచ్చిన 'ఎదో ఎదో' పాట కూడా ఆకట్టుకుంటోంది. 1970స్ కలకత్తా బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇందులో నాని రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. కృతి తో పాటుగా సాయి పల్లవి - మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాను జాన్ వర్గేష్ సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథ అందించారు. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా వస్తున్న 'శ్యామ్ సింగ రాయ్' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.