Begin typing your search above and press return to search.

వీడియో టాక్: ఏదో జరుగుతోంది

By:  Tupaki Desk   |   5 July 2017 10:31 PM IST
వీడియో టాక్: ఏదో జరుగుతోంది
X
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ క్లాస్ సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. మధ్యలో దర్శకులను నమ్మి చేసిన మాస్ ఎటెంప్ట్స్ ఫెయిల్ అవడంతో.. తిరిగి తనకు స్ట్రెంగ్త్ అయిన క్లాస్ జోనర్ లోకి వచ్చేశాడు. క్లాస్ మూవీస్ తీయడంలో మాంచి టేస్ట్ ఉన్న దర్శకుడు శేఖర్ కమ్ములతో ఫిదా చిత్రాన్ని ఫినిష్ చేసేయగా.. ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాల్లో తెగ బిజీగా ఉంది టీం.

ఇప్పటికే 'వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే' పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫిదా యూనిట్.. ఇప్పుడు 'ఏదో జరుగుతోంది ఎదలో అలజడి.. ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి' అంటూ సాగే మరో పాటను రిలీజ్ చేశారు. హీరో వరుణ్ తేజ్.. హీరోయిన్ సాయిపల్లవి మధ్య సాగే ఈ పాటను.. ఫారిన్ లొకేషన్స్ లో అద్భుతంగా చిత్రీకరించాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. శక్తికాంత్ కార్తీక్ అందించిన సంగీతం ఈ మెలోడీకి ప్రాణంగా నిలిచిందని చెప్పచ్చు. అయితే.. అద్భుతమైన తన రచనతో సిరివెన్నెల సీతారామశాస్త్రి చేసిన పదాల కూర్పు.. ఈ పాటకు అసలు సిసలైన ఆకర్షణ. అరవింద్ శ్రీనివాస్.. రేణుకల గాత్రం కూడా ఆకట్టుకుంటుంది.

ఒక్కో పాటతో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు దర్శకుడు. మరోవైపు వరుసగా విడుదల చేస్తున్న పాటల్లోని విజువల్స్ చూస్తుంటే.. ఈ సినిమాపై దిల్ రాజు పెట్టిన ఖర్చు.. ఆయన నమ్మకం కనిపించడంలో ఆశ్చర్యం లేదు. కాకపోతే రీషూట్స్ జరుగుతుంటే.. ఏవేవో డౌట్లు వచ్చేస్తున్నాయి. అది సంగతి.