Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ఈడు బిల్డప్ యాక్షన్ గోల్డ్ ఎహె!

By:  Tupaki Desk   |   25 Sep 2016 4:32 PM GMT
ట్రైలర్ టాక్: ఈడు బిల్డప్ యాక్షన్ గోల్డ్ ఎహె!
X
కమెడియన్ హీరో సునీల్ తను చెప్పే మాటలకు తగ్గట్లుగానే సినిమాలు చేస్తూ కెరీర్ కంటిన్యూ చేసేస్తున్నాడు. తను చేసే సినిమాల్లో.. సునీల్ ది హీరో కేరక్టరే కామెడీ కేరక్టర్ నే లీడ్ రోల్ లోకి పట్టుకొచ్చేసినట్లు కనిపిస్తుంది. తనకు అచ్చొచ్చిన ఈ జోనర్ లోనే సునీల్ చేసిన మరో సినిమా ఈడు గోల్డె ఎహే. ఇప్పుడీ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

ట్రైలర్ స్టార్టింగ్ నుంచి తన పాత్రను తనే నెరేట్ చేస్తున్న సునీల్ మనకు కనిపిస్తాడు. ఆ పాత్ర గురించి సునీల్ చెప్పేదానికి భిన్నంగా.. మూవీలో కేరక్టర్ బిహేవ్ చేస్తూ ఉంటుంది. అన్ని యాంగిల్స్ లోనూ కామెడీ పంచడానికి చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. ఓ థ్రిల్.. ఎంటర్టెయిన్మెంట్.. మాస్ ఎలిమెంట్స్.. క్లాస్ సీన్స్ అన్ని యాంగిల్స్ నీ మిక్స్ చేసినట్లు ట్రైలర్ లోనే కపిసిస్తోంది. ప్రామిసింగ్ గా ఉందనేంత రేంజ్ కనిపించకపోయినా.. మళ్లీ కామెడీ టైమింగ్ లో పాత సునీల్ కనిపించడం మాత్రం ఖాయం.

వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈడు గోల్డ్ ఎహె చిత్రంలో పోసాని కృష్ణ మురళి.. షకలక శంకర్ ల కామెడీ బాగానే పేలినట్లు కనిపిస్తోంది. టీజర్ తో మంచి హైప్ తీసుకొచ్చిన ఈ టీమ్.. ట్రైలర్ విషయంలో కూడా మంచి జాగ్రత్తలే తీసుకున్నారు. కామెడీ-యాక్షన్ ఉన్నాయి కాబట్టి బీ-సీ సెంటర్ల ఆడియన్స్ థియేటర్లకు రప్పించడం రిస్క్ కాకపోవచ్చు. కంటెంట్ బాగుంటే మెల్లగా ఏ క్లాస్ థియేటర్లలోనూ సునీల్ మూవీ బాగానే పుంజుకునే ఛాన్సులున్నాయి.