Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: కుర్రాళ్లకు ఏమైంది

By:  Tupaki Desk   |   10 Jun 2018 5:27 AM GMT
ట్రైలర్ టాక్: కుర్రాళ్లకు ఏమైంది
X
తన మొదటి సినిమా పెళ్లి చూపులతో ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులను కూడా అమితంగా ఆకర్షించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ కొత్త సినిమా ఈ నగరానికి ఏమైంది. సురేష్ బాబు నిర్మాతగా నలుగురు కొత్త కుర్రాళ్లతో చేసిన ఈ ప్రయోగం మీద మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ తో వాటిని అమాంతం పెంచే ప్రయత్నం అయితే జరిగింది. రకరకాల గోల్స్ తో సరదాగా లైఫ్ నిఎంజాయ్ చేస్తున్న నలుగురు కుర్రాళ్ళు. వాళ్లకు ఒక కామన్ గర్ల్ ఫ్రెండ్. ఒక్కొక్కరిది ఒక్కొక్క పిచ్చి. సినిమాలు తీయాలని లైఫ్ లో గట్టిగా సెటిల్ కావాలని తామేంటో నిరూపించుకోవాలని తాపత్రయపడే యువకుల కథకు తరుణ్ భాస్కర్ థ్రిల్లర్ టచ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. అందరూ కొత్త మొహాలే కావడంతో చాలా ఫ్రెష్ అప్పీల్ కనిపిస్తోంది. విశ్వక్ సేన్-సాయి సుశాంత్-అభినవ్ గోమటం-వెంకటేష్ కకుమాను ఫ్రెండ్స్ బ్యాచ్ గా నటించగా స్నేహితురాలిగా ఈజీ గో పాత్రలో ఇప్పటికే మనకు పరిచయమున్న అనీషా అంబ్రోస్ చేసింది. మరో పాత్రలో సిమ్రాన్ చౌదరి కనిపించింది. చాలా వెరైటీ కాన్సెప్ట్ తో కథకు సంబంధించిన క్లూ ఎక్కువగా రివీల్ కాకుండా కట్ చేసిన ట్రైలర్ సినిమా మీద ఆసక్తిని పెంచేలా ఉంది.

మొదటి సినిమాను హోల్ ఫామిలీ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దిన తరుణ్ భాస్కర్ ఈ సారి క్లియర్ గా యూత్ ని టార్గెట్ చేసాడు. యూత్ మధ్య ఉండే రిలేషన్స్ ఎమోషన్స్ ఎలాంటి కృత్రిమత్వం లేకుండా సహజంగా చిత్రీకరించిన తీరు మరోసారి తనకు మాత్రమే సొంతమైన స్టైల్ అఫ్ మేకింగ్ ని చూపించింది. రెండేళ్ల గ్యాప్ తో వస్తున్న మూవీ కాబట్టి తరుణ్ భాస్కర్ స్క్రిప్ట్ పరంగా చాలా హోమ్ వర్క్ చేసినట్టే కనిపిస్తోంది. వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సింక్ అవ్వగా నికేత్ బొమ్మిరెడ్డి ఛాయాగ్రహణం సిటీ లైఫ్ ని కంటికి కట్టినట్టు చూపించింది. మనం ప్రతి సినిమా ప్రారంభంలో చూసే నో స్మోకింగ్ యాడ్ లో మొదటి లైన్ నే టైటిల్ గా పెట్టుకున్న ఈ మూవీ వ్యసనాలు లక్ష్యాలు అనే లైన్ చుట్టూ ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి మంచి ఇంటెన్సిటీ చూపడంలో తరుణ్ భాస్కర్ మరోసారి సక్సెస్ అయ్యాడు. సున్నితమైన ప్రేమ కథ నుంచి థ్రిల్ గా అనిపించే యూత్ స్టోరీ వైపు టర్న్ తీసుకున్న తరుణ్ భాస్కర్ కు అగ్ర నిర్మాత సురేష్ బాబు అండ దొరికింది కాబట్టి నిర్మాణ పరంగా రాజీ ప్రశ్నే ఉండదు.