Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : ఈడోరకం ఆడోరకం
By: Tupaki Desk | 14 April 2016 10:37 AM GMTచిత్రం: ‘ఈడోరకం ఆడోరకం’
నటీనటులు: మంచు విష్ణు - రాజ్ తరుణ్ - రాజేంద్ర ప్రసాద్ - సోనారికా - హెబ్బా పటేల్ - రవిబాబు - పోసాని కృష్ణమురళి - సత్య కృష్ణ - అభిమన్యు సింగ్ - సుప్రీత్ - ఫిష్ వెంకట్ - హేమ తదితరులు
సంగీతం:సాయికార్తీక్
ఛాయాగ్రహణం: సిద్దార్థ్ రామస్వామి
మాటలు: డైమండ్ రత్నబాబు
నిర్మాత: అనిల్ సుంకర
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: నాగేశ్వరరెడ్డి
మంచు ఫ్యామిలీ కథానాయకుడు విష్ణుకు రీమేకుల మీద మహా గురి. గత కొన్నేళ్లలో విష్ణు చేసిన మెజారిటీ సినిమాలు మరో భాష నుంచి అరువు తెచ్చుకున్నవే. గత రెండేళ్లలో ఎర్రబస్సు.. డైనమైట్.. లాంటి రీమేకులతో ట్రై చేశారు. ఈ ఏడాది కూడా మరో రీమేక్ తో రెడీ అయిపోయాడు విష్ణు. ఈసారి అతడికి రాజ్ తరుణ్ కూడా తోడయ్యాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా.. ఈడోరకం ఆడోరకం. ఓ పంజాబీ సినిమా ఆధారంగా నాగేశ్వరరెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి విష్ణుకు ఈ కొత్త రీమేక్ ఎలాంటి ఫలితాన్నిచ్చేలా ఉందో చూద్దాం పదండి.
కథ:
పెద్ద లాయర్ కొడుకైన అర్జున్ (మంచు విష్ణు).. ఎస్సై కొడుకైన అశ్విన్ (రాజ్ తరుణ్) మంచి స్నేహితులు. మహా అల్లరోళ్లయిన వీళ్లిద్దరూ కలిసి తమ ఫ్రెండు పెళ్లికి వెళ్తారు. అక్కడ నీలవేణి (సోనారికా) అనే అమ్మాయిని చూసి అర్జున్ పడిపోతే.. అశ్విన్ తో సుష్మిత (హెబ్బా పటేల్) కనెక్టయిపోతుంది. ఐతే నీలవేణి ఓ అనాథను మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటోందని తెలిసి తనకు ఎవరూ లేరని నాటకమాడతాడు అర్జున్. తర్వాత ఆమె వెంటపడి తన ప్రేమను గెలుచుకుంటాడు. నీలవేణి అన్నయ్య వీళ్ల సంగతి తెలియగానే వెంటనే పెళ్లి చేసేస్తాడు. అర్జున్ కు తెలియకుండా అతడి ఇంట్లోనే పై పోర్షన్ నీలవేణి అద్దెకు తీసుకోవడంతో అతను ఇరుక్కుపోతాడు. ఇక నీలవేణి తన భార్య అని ఇంట్లోవాళ్లకు తెలియకుండా.. తాను అనాథనని నీలవేణికి తెలియకుండా అశ్విన్ సాయంతో అర్జున్ ఎలా మేనేజ్ చేశాడు.. మధ్యలో సుష్మిత సంగతి ఏమైంది.. వీళ్ల గుట్టంతా బయటపడ్డాక చివరికి ఏమైంది.. అన్నది తెర మీదే చూడాలి.
కథనం-విశ్లేషణ:
‘ఈడోరకం ఆడోరకం’ కథేంటో నాలుగు ముక్కల్లో తెలుసుకుంటేనే.. ఇది లాజిక్కులతో ఏమాత్రం సంబంధం లేకుండా సాగిపోయే సినిమా అని అర్థమైపోతుంది. థియేటర్లలోకి అడుగుపెట్టే ముందే ‘లాజిక్’ అనే మాటను తీసి పక్కన పెట్టేసి వస్తే తప్ప.. థియేటర్లలో కుదురుగా కూర్చోలేం.
హీరో తన ఇంట్లోనే పైన అద్దెకు దిగి.. అక్కడ తన పెళ్లాన్ని పెట్టి.. వేరొకడిని ఆమె మొగుడిగా పరిచయం చేసి.. రాత్రి పూట వెళ్లి కాపురం చేసి రావడం.. షాపింగ్ మాల్ లో తన తండ్రికి అడ్డంగా దొరికిపోయినా.. ఇంటికొచ్చి అక్కడున్నది తాను కాదని.. తాను ఇంట్లోనే నిద్రపోతున్నానని కవర్ చేసుకోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్ని సిత్రాలో ‘ఈడోరకం ఆడోరకం’లో. ఇలాంటి సిత్రాలన్నింటికీ ముందే సిద్ధపడిపోతే.. లాజిక్కుల గురించి ఆలోచించకుండా.. ఇలా ఎలా సాధ్యం అని ప్రశ్నలు వేయకుండా కూర్చోగలిగితే.. ఈ కన్ఫ్యూజింగ్ కామెడీని ఎంజాయ్ చేయొచ్చు.
తెలుగులో కన్ఫ్యూజన్ కామెడీస్ ఎప్పుడో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ దగ్గర్నుంచి చూస్తున్నాం. గత దశాబ్దంలో అయితే ఈ తరహా సినిమాలదే హవా. ఐతే కామెడీ వర్కవుట్ చేయగలిగితే.. టైంపాస్ చేయించగలిగితే.. రొటీన్ అయినా పర్వాలేదు ఈ తరహా సినిమాల్ని చూస్తామని ప్రేక్షకులు రుజువు చేస్తూనే ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్ తోనే ‘ఈడోరకం ఆడోరకం’ టీమ్ కూడా మరో రొటీన్ కన్ఫ్యూజన్ కామెడీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. పంజాబీ నుంచి అరువు తెచ్చుకున్నట్లు చెప్పారు కానీ.. నిజానికి మన దగ్గరే ఇలాంటి కథలు బోలెడు వచ్చాయి. ఒరిజినల్ లో ఏముందో ఏమో కానీ.. ‘ఈడోరకం ఆడోరకం’ చూస్తుంటే మాత్రం చాలా తెలుగు సినిమాలు గుర్తుకొస్తాయి.
రొటీనే అయినా.. ఇల్లాజికల్ గా సాగినా.. టైంపాస్ చేయించే కామెడీ ఉండటం ‘ఈడోరకం ఆడోరకం’కు చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్. హీరోల కంటే కూడా కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ ప్రేక్షకుల్ని ఎక్కువ ఎంటర్టైన్ చేస్తారు. ఆయన కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగానే నవ్విస్తాయి. రవిబాబు.. పోసాని కృష్ణమురళి కూడా తమ వంతుగా ఓ చేయి వేశారు. పేరుమోసిన కమెడియన్లెవ్వరూ లేకపోయినా ఈ ముగ్గురితో ముడిపడ్డ సన్నివేశాలు నవ్వించడంతో సమయం సాగిపోతుంది. ఇక హీరోయిన్లద్దరూ తమ వంతుగా అందాల విందు చేయడంతో ఆ మేరకు హ్యాపీ అయిపోతారు యూత్.
‘ఈడోరకం ఆడోరకం’ అని పేరు పెట్టి.. ఇదేదో హీరోల క్యారెక్టరైజేషన్ల మీద నడిచే సినిమా అన్నట్లు కలరింగ్ ఇచ్చారు కానీ.. ఇందులో హీరోల పాత్ర తక్కువే. ఆరంభంలో ఓ 20 నిమిషాలు మాత్రమే హీరోల డామినేషన్ సాగుతుంది. ఆ తర్వాత రాజేంద్రప్రసాదే లీడ్ తీసుకుంటాడు. ప్రథమార్ధంలో కామెడీ ఓ మోస్తరుగా అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో పాటల్లేకుండా కామెడీ మీదే సినిమాను నడిపించారు. కొన్ని సన్నివేశాల్లా కామెడీ బాగానే పండింది.
ద్వితీయార్ధంలో ఉన్న ఏకైక పాట సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణ. సినిమా చూపిస్త మావా.. తరహాలో సాగే ‘రెండు పుంజులున్నాయ్’ పాట మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్టవుతుంది. ఆ పాట చిత్రీకరణ బాగుంది. ఆ తర్వాత క్లైమాక్స్ గురించి పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. కథ మొదలైనపుడే ఎలా ముగుస్తుందో అర్థమైపోతుంది కాబట్టి.. ఈ పాట అయిపోయాక సాగేదంతా రొటీన్ ప్రహసనమే. కథాకథనాల పరంగా ఏమాత్రం కొత్తదనం ఆశించినా నిరాశ తప్పదు. కొత్తదనం కోరుకుంటూ.. లాజిక్కులు వెతుకుతూ సినిమా చూస్తే మాత్రం ఫ్రస్టేట్ అవడం ఖాయం. మాస్ ఆడియన్స్ కు మాత్రం సినిమా బాగానే ఎక్కే అవకాశముంది.
నటీనటులు:
మంచు విష్ణు లుక్ గత సినిమాల కంటే బాగుంది. నటన ఓకే. కొన్ని కామెడీ సీన్స్ లో బాగా చేశాడు. విష్ణుతో పోలిస్తే రాజ్ తరుణ్ పాత్రకు ప్రాధాన్యం తక్కువే కానీ.. అతను తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న రాజ్ తరుణ్ కొన్ని సన్నివేశాల్లో తన ప్రత్యేకత చూపించాడు. చివర్లో పోలీస్ స్టేషన్ సీన్లో అతడి నటన ఆకట్టుకుంటుంది. రాజేంద్ర ప్రసాద్ అలవోకగా కామెడీ పండించాడు. సినిమాకు ఆయనే మూల స్తంభం. హీరోయిన్లు నటన పరంగా చేసిందేమీ లేదు. ఇద్దరూ అందాల ప్రదర్శనలో పోటీ పడ్డారు. హెబ్బా పాత్ర.. ఆమె నటన ‘కుమారి 21 ఎఫ్’ను తలపిస్తుంది. ఆమె ఇంకా ఆ సినిమా మూడ్ నుంచి బయటికి వచ్చినట్లు లేదు. పోసాని.. రవిబాబులతో పాటు ఫిష్ వెంకట్.. ప్రభాస్ శీను.. పంచ్ ల సాయం చేశారు. అభిమన్యు సింగ్.. సుప్రీత్ చేసిందేమీ లేదు. మిగతా వాళ్లంతా మామూలే.
సాంకేతికవర్గం:
సాయికార్తీక్ పాటలు అంతగా రిజిస్టరవ్వవు. ఏదో అలా సాగిపోతాయంతే. అన్నింట్లోకి రెండు పుంజులున్నాయ్ పాట బెటర్. బ్యాగ్రౌండ్ స్కోర్ మామూలే. సిద్దార్థ్ రామస్వామి ఛాయాగ్రహణం ఓకే. డైమండ్ రత్నబాబు కామెడీ పంచ్ లు కొన్ని చోట్ల పేలాయి. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. దర్శకుడు నాగేశ్వరరెడ్డి తనకు అలవాటైన విద్యనే ప్రదర్శించాడు. తన స్టయిల్లో.. తన పరిధిలో కామెడీ పండించడానికి ప్రయత్నం చేశాడు. ఏమాత్రం కొత్తదనం కోసం ప్రయత్నించలేదు. లాజిక్ సంగతి పూర్తిగా ఇష్టానుసారం కథనాన్ని నడిపించడం నిరాశ కలిగించే విషయమే. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో ఉంచుకుని వారికి నచ్చే అంశాలతో సినిమాను తీర్చిదిద్దాడు.
చివరగా: ‘ఈడోరకం ఆడోరకం’ - ఇదోరకం కామెడీ
రేటింగ్- 2.75/5