Begin typing your search above and press return to search.

విమర్శల నుంచి తప్పించుకున్న సినిమా

By:  Tupaki Desk   |   19 April 2016 1:59 PM GMT
విమర్శల నుంచి తప్పించుకున్న సినిమా
X
టాలీవుడ్ సినిమాల్లో అడల్ట్ కంటెంట్ ఆధారంగా వచ్చే సినిమాలకు విమర్శలు తప్పవు. కొత్త డైరెక్టర్లు తమను తాము సేఫ్ గా లాంఛ్ చేసుకోవడానికి ఇలాంటి ఎటెంప్ట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ రోజుల్లో - బస్టాప్ వంటి చిత్రాలు తీసి అందరితోనూ విమర్శలకు గురైన మారుతి.. ఇప్పుడు మంచి సినిమాలు తీసే దర్శకుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. భలేభలే మగాడివోయ్ తర్వాత ఫ్యామిలీ చిత్రాల డైరెక్టర్ అయిపోయాడు.

కానీ మొదట్లో మాత్రం మారుతి తీసిన సినిమాలకు విమర్శలు తప్పలేదు. రీసెంట్ గా వచ్చిన మంచు విష్ణు - రాజ్ తరుణ్ ల మూవీ ఈడో రకం ఆడో రకం కూడా డబుల్ మీనింగులు జోరుగా దట్టించిన అడల్ట్ కంటెంట్ సినిమానే. బాక్సాఫీస్ దగ్గర బాగానే పెర్ఫామ్ చేస్తున్న ఈ సినిమాని.. విచిత్రంగా ఎవరూ విమర్శించలేదు. కనీసం ఇది అడల్ట్ ఫిలిం అనే ఫీలర్లను కూడా ఇవ్వలేదు. ఇది బీ గ్రేడ్ కంటెంట్ ఉన్న సినిమా అనే మాటను కూడా విమర్శకులు ఉపయోగించకపోవడం ఆశ్చర్యకరమే. ఇప్పుడొస్తున్న సినిమాల్లో ఇలాంటివన్నీ కామన్ అయిపోతున్నాయి.

స్టార్ హీరోల సినిమాల్లోనే లిప్ కిస్సులు ఉంటున్నపుడు.. ఇలాంటి డబుల్ మీనింగులను పట్టించుకోవాల్సిన పని లేదనే ఫీలింగ్ వచ్చి ఉండొచ్చంటున్నారు. అలా.. ఈడో రకం ఆడో రకం.. విమర్శకుల నుంచి భలేగా ఎస్కేప్ అయిపోయింది. అయినా.. క్లీన్ కామెడీ సినిమాలు తీసే జి.నాగేశ్వరరెడ్డి డైరెక్షన్ లో ఇలాంటి సినిమా రావడం మాత్రం ఆశ్చర్యకరమే