Begin typing your search above and press return to search.

ఈడు.. ఆడు.. మధ్యలోనే ఫిక్సయ్యారు

By:  Tupaki Desk   |   2 April 2016 5:00 PM IST
ఈడు.. ఆడు.. మధ్యలోనే ఫిక్సయ్యారు
X
మంచు విష్ణు - రాజ్ తరుణ్ లు హీరోలుగా 'ఈడో రకం ఆడో రకం' టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ఆసక్తి పెరిగింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆడియోకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టెయినర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందించారు.

ఇప్పటికే ఫైనల్ కాపీ రెడీ అయిపోవడంతో రిలీజ్ డేట్ విషయంలో సీరియస్ డిస్కషన్స్ చేసింది 'ఈడో రకం ఆడో రకం' యూనిట్. ఏప్రిల్ 8న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల ఉండడం, 22న బన్నీ సరైనోడు వస్తుండడంతో.. మధ్యలో వారంలో విడుదల చేయడం సేఫ్ అని డిసైడ్ అయ్యారు యూనిట్. ఏప్రిల్ 14 నుంచి వరుసగా సెలవలు ఉండడంతో.. ఆ డేట్ కే రిలీజ్ చేయడం సేఫ్ అని భావించారు. అయితే.. అదే రోజున కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తెరి తెలుగు వెర్షన్ సరైనోడు కూడా విడుదల అవుతోంది. దీన్ని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తుండడంతో.. భారీగానే విడుదలవుతోంది.

మరోవైపు పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అయ్యి అప్పటికి వారమే అవుతుంది. అయినా సరే.. 'ఈడో రకం ఆడో రకం' ను ఏప్రిల్ 14నే విడుదల చేసేందుకు యూనిట్ నిర్ణయించింది. ఈ మూవీలో మంచు విష్ణు సరసన సోనారికా భడోరియా - రాజ్ తరుణ్ కి జంటగా హేభా పటేల్ నటించారు.