Begin typing your search above and press return to search.
ఆ సినిమా చేస్తే వేరేలా ఉండేది
By: Tupaki Desk | 4 Aug 2017 5:30 AM GMTమన తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు తక్కువ అని అందరికి తెలిసిన విషయమే. ఎందుకు తక్కువ అనే విషయం కూడా తెలుసు కానీ కారణాలు ఎవరికి కావాలి చెప్పండి. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు తెలుగులో రావటం వలన మన తెలుగు అమ్మాయిలుకు కూడా హీరోయిన్ గా నిరూపించుకునే అవకాశాలు వస్తున్నాయి. సుకుమార్ ప్రొడ్యూస్ చేసిన 'దర్శకుడు' సినిమాలో హీరోయిన్ ఇషా తెలుగు అమ్మాయి కావడం విశేషం. ఈ సినిమా కన్నా ముందు ‘అంతకు ముందు ఆ తరవాత’, ‘బందిపోటు’, ‘మాయా మాల్’లో నటించింది. ‘అమీ తుమీ’తో మంచి గుర్తింపు తెచ్చుకొంది.
తెలుగు అమ్మాయిలు మామూలుగా హీరోయిన్ అవ్వడానికి ఇష్టపడరు కదా అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది సినిమా అవకాశం ఎలా వచ్చింది అని అడిగితే “అలా ఎందుకు అనుకుంటున్నారు? మన తెలుగు అమ్మాయిలు కూడా చక్కగా నటిస్తారు. వాళ్ళకి తగిన అవకాశాలు రావాలి కొత్త కథలు దొరకాలి అంతే. నేను చదువుతున్నప్పటి నుండి నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. ముందు హీరోయిన్ అవ్వాలి అని ఏమి అనుకోలేదు. ఒక సారి నా ఫోటోని ఫేస్ బుక్ లో చూసి డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణగారు ‘అంతకుముందు ఆ తరవాత’ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఒకసారి నాకు దిల్ రాజు నిర్మించే సినిమాలో ఛాన్స్ మిస్ అయ్యింది. అది కానీ వస్తే నా కెరియర్ కొంచెం ఇప్పటి కంటే గొప్పగా ఉండేది'' అని తలుచుకొని బాధపడుతుంది.
ఇప్పుడు విడుదలైన ‘దర్శకుడు’ సినిమాలో నాకు మంచి పాత్ర దక్కింది. ఫ్యాషన్ డిజైనర్ నమ్రత పాత్ర లో నటించాను. ఈ పాత్రలో అన్నీ భావోద్వేగాలున్నాయి. ఈ సినిమాలో మాటలు కూడా చాలా బాగున్నాయి. నాకు డ్యాన్స్ పెద్దగా రాదు కానీ ఏదో చేశాను ఈ సినిమాలో అని కష్టాన్ని గుర్తుకు తెచ్చుకొంది. తెలుగు అమ్మాయిలు గ్లామర్ పాత్రలు చేయరు అందుకే తెలుగు వాళ్ళని సినిమాలలో తీసుకోరు అని ఒక అపోహ ఉంది. అది నిజం కాదు ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు వస్తున్న తెలుగు హీరోయిన్లు అంతా మంచి నటులే పైగా అందం కూడా ఉన్నవారే. మంచి అవకాశాలు వస్తే మాత్రం మా ప్రతిభను నిరూపించుకోగలము అని చెబుతుంది ఇషా.