Begin typing your search above and press return to search.

తెలుగ‌మ్మాయి ఇర‌గ‌దీస్తోంది

By:  Tupaki Desk   |   29 April 2018 4:30 AM GMT
తెలుగ‌మ్మాయి ఇర‌గ‌దీస్తోంది
X
తెలుగు ఇండ‌స్ట్రీలో తెలుగ‌మ్మాయిల‌కు అవ‌కాశాలు రావ‌డం లేదంటూ ఒక‌టే ర‌చ్చ ర‌చ్చ జ‌రుగుతోంది. ఓ నాలుగు రోజులుగా ఆ ర‌చ్చ కాస్త స‌ద్దుమ‌ణిగింది కానీ మొన్న‌టి వ‌ర‌కు టీవీ వేస్తే చాలు అదే ర‌చ్చ‌. ఇలాంటి స‌మ‌యంలో ఓ అచ్చ‌తెనుగు అమ్మాయి అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తోంది. ఆమెవ‌రో కాదు ఈషా రెబ్బా. ఇన్నాళ్లు ఆమెను ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోయినా ఇప్పుడు వ‌రుస‌పెట్టి అవ‌కాశాలు వ‌స్తున్నాయ్‌.

అంత‌కుముందు ఆ త‌రువాత సినిమాలో 2013లో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది ఈషా. ఆ సినిమాతో పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. రెండేళ్ల వ‌రక ఖాళీగా ఉంది. ఆ త‌రువాత అల్ల‌రి న‌రేష్ ప‌క్క‌న న‌టించింది కానీ ఆ సినిమా కూడా అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. 2017లో మూడు సినిమాల‌లో అవ‌కాశాలు ద‌క్కించుకున్నా కావాల్సినంత పేరు మాత్రం రాలేదు. అమీ తుమీ ద‌ర్శ‌కుడు సినిమాల‌లో ఫ‌ర్వాలేద‌నిపించింది. ఇక ఈ ఏడాది విడుద‌లైన అ సినిమాతో ఆమె అంద‌రి మ‌న‌సులు దోచుకుంది. అందులో చాలా సింపుల్‌గా అందంగా మెరిసింది భామ‌. ఈషా బావుందే అనిపించుకుంది. నిత్యా మీన‌న్ ల‌వ‌ర్‌ గా అద‌ర‌గొట్టేసింది. ఇంకేముంది ద‌ర్శ‌క నిర్మాత‌ల చూపు ఆమెపై ప‌డింది.

తెలుగమ్మాయిల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌రు అని విమ‌ర్శించేవాళ్ల‌కి ఈషా ఒక చెంప‌పెట్టులాంటిది. చ‌క్క‌ని అందం అభినయం క‌లిస్తే ఎవ‌రికైనా అవ‌కాశాలు వ‌స్తాయి. దాని కోసం ఎక్స్ పోజింగ్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఈషా నిరూపించింది. ఎందుకంటే ఆమె ఏ సినిమాలోనూ అస‌భ్యంగా క‌నిపించిన దాఖాలాలు లేవు. చేతినిండా సినిమాల‌తో ఆర్ధికంగా కూడా ఈషా మంచి స్థాయిలోనే ఉంది. మొన్న‌నే బెంజ్ కారు కూడా కొనుక్కుంది. ప్ర‌స్తుతం సుమంత్ ప‌క్క‌న సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం అనే హార‌ర్ థ్రిల్ల‌ర్ సినిమాలో న‌టిస్తోంది. ఇందులో ప‌ల్లెటూరి పిల్ల‌గా అందంగా క‌నిపించ‌నుంది.