Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: బేబీ డాల్ డ్రెస్ లో తెలుగు బ్యూటీ

By:  Tupaki Desk   |   16 Dec 2019 2:30 PM GMT
ఫోటో స్టోరీ: బేబీ డాల్ డ్రెస్ లో తెలుగు బ్యూటీ
X
మనకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న అచ్చ తెలుగుభామ ఈషా రెబ్బా. కెరీర్ మొదట్లో ఈషా చక్కని విజయాలు సాధించింది కానీ ఈమధ్య మాత్రం విజయాలేమీ దక్కడం లేదు. చివరి సినిమా 'రాగల 24 గంటల్లో' కూడా నిరాశపరిచింది. అయితే కెరీర్లో అతి సహజమైన ఈ ఎత్తుపల్లాలతో ఈషా నిరాశకు గురయ్యే అమ్మాయి కాదు. అందుకే సామాజిక మాధ్యమాల్లో తనదైన శైలిలో చెలరేగిపోతూ ఉంది.

ఈమధ్య ఈష ఒక గ్లామరస్ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలకు ప్రత్యేకంగా క్యాప్షన్ ఏదీ ఇవ్వలేదు కానీ రెండు సీతాకోక చిలుకల ఎమోజీలను మాత్రం పెట్టింది. మెరుస్తున్న నీలం రంగు గౌన్లో అందంగాపోజులిచ్చింది. గౌన్ చాలా పొట్టిగా ఉండడంతో ఎంతో స్టైలిష్ గా ఉంది. మెడలో ఒక నెక్లెస్.. చేతి వెలికి ఒక ఉంగరం తప్ప పెద్దగా ఆభరణాలేవీ దరించలేదు. హై హీల్స్ ధరించి.. పైకి చూస్తూ ఒక మోడల్ తరహాలో పోజిచ్చింది. ఇలాంటి ఫోటోలతోనే తెలుగు అమ్మాయిలు బాలీవుడ్ బ్యూటీలకు ఏమాత్రం తీసిపోరని ఫిలిం మేకర్లకు తనవైపునుండి హింట్స్ ఇస్తోంది.

ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి మంచి స్పందన దక్కింది. "నువ్వు అందాలరాశి".. "బ్యూటీ అలర్ట్".. "బేబీ డాల్ డ్రెస్ లో ఏంజెల్".."హాట్ థైస్" అంటూ రెచ్చిపోయారు. ఇక ఈషా ఫ్యూచర్ ప్రాజెక్టుల సంగతి మాట్లాడుకుంటే 'ఆయిరం జన్మంగళ్' అనే ఒక తమిళ హారర్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 20 న రిలీజ్ కానుంది. మరో కన్నడ సినిమాలోనూ నటిస్తోంది. ఇవి కాకుండా 'లస్ట్ స్టోరీస్' తెలుగు వెర్షన్ లో కూడా నటిస్తోంది.