Begin typing your search above and press return to search.

విలువిద్యపై ఎక్కు పెట్టిన టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ!

By:  Tupaki Desk   |   20 May 2021 6:30 AM GMT
విలువిద్యపై ఎక్కు పెట్టిన టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ!
X
గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్స్ మోడలింగ్ తో పాటుగా సినిమాల్లోకి రావాలనే ప్రయత్నంలో ఎన్నో తంటాలు పడుతుంటారు. కొన్నిసార్లు సినిమాల్లో క్లిక్ అయితే మాత్రం స్టోరీ డిమాండ్ మేరకు వర్కౌట్స్ చేసి పాత్రకు సూటబుల్ బాడీ మేకోవర్ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. కానీ కొందరు అలా కాదు. సినిమాలు చేతిలో లేకపోయినా క్యారెక్టర్స్ రావాలనే ఆశలతో వర్కౌట్స్ చేస్తూ స్లిమ్ గా తయారవుతారు. మరికొందరు ఎలాగో అవకాశాలు వస్తున్నాయని బాడీ మేకోవర్ చేసి మంచి ఫిగర్ తో స్లిమ్ అవుతుంటారు. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో నెమ్మదిగా కెరీర్ కంటిన్యూ చేస్తున్నటువంటి హీరోయిన్స్ చాలామంది ఉన్నారు.

అందులో తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో తెలుగులో అవకాశాలు పొందడమే వీళ్లకు కష్టంగా మారింది. అలా సరైన అవకాశాలు లేక వెయిటింగ్ లో ఉన్న హీరోయిన్ ఈషారెబ్బ. ఈ అమ్మడు కెరీర్ ప్రారంభించి ఎనిమిది సంవత్సరాలు అవుతోంది. కానీ ఇంతవరకు కెరీర్లో సరైన బ్రేక్ లభించలేదు. ఇప్పుడు ఈషా లీడ్ హీరోయిన్ గా భారీ హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. కానీ అందంతో పాటు గ్లామర్ రోల్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా అదృష్టం లేకనే ఇంకా లీడ్ రోల్స్ చేయట్లేదేమో అనిపిస్తుంది. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ రోల్స్ చేసేందుకు వెనకాడింది. కానీ ఇప్పుడు కూడా అలాగే కూర్చుంటే పనులు కావని అలాంటి హద్దులన్ని చేరిపేసింది.

ఆ మధ్య అన్ని రోల్స్ చేయడానికి రెడీ అంటూ చెప్పేసింది. ఇదిలా ఉండగా.. ఈషాకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఫ్యాన్స్ కోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా విలువిద్య నేర్చుకుంటున్న ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో ఈషా శ్రద్దగా విలువిద్యపై ఫోకస్ పెట్టడం మనం గమనించవచ్చు. ఆల్రెడీ ఈషా అంటే క్యూట్ గా, ఫిట్ గా ఉంటుంది. మరి లీడ్ హీరోయిన్ గా ఎప్పుడు బిజీ అవుతుందో అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాలో ఓ కీ రోల్ ప్లే చేసింది ఈషా. చూడాలి మరి ఈ ముప్పై ఏళ్ల సుందరి ఇకనైనా బిజీ అవుతుందేమో!