Begin typing your search above and press return to search.

కిల్ల‌ర్ లుక్ తో క‌ట్టి ప‌డేస్తున్న తెలుగ‌మ్మాయ్

By:  Tupaki Desk   |   29 April 2022 3:30 AM GMT
కిల్ల‌ర్ లుక్ తో క‌ట్టి ప‌డేస్తున్న తెలుగ‌మ్మాయ్
X
ఈషా రెబ్బా తన తాజా చిత్రాలలో అద్భుతంగా కనిపిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈషా రెబ్బా ఆ తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో `అంతకు ముందు ఆ తర్వాత`లో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత కూడా బందిపోటు-అమీ తుమీ-దర్శకుడు-అ! వంటి చిత్రాల్లో నటించింది. లస్ట్ స్టోరీస్ కి రీమేక్ అయిన పిట్ట కథలు అనే వెబ్ మూవీలో కూడా నటించింది.

ఈషా రెబ్బా కెరీర్ లో పెద్ద హిట్‌లు లేవు. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో సెమీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగమ్మాయిగా పేరు తెచ్చుకోవడంతో గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ ఆ తర్వాత ట్రెండ్ కు తగ్గట్టుగా లుక్ మార్చుకుని అభిమానులకు మంచి కన్నుల పండువగా నిలిచింది. గ్లామర్ షోలు చేయడంలో ఆమె ఎంతగా మెరుగైందో ఆమె లేటెస్ట్ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది.

తాజాగా ఇషా రెబ్బా షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైర‌ల్ గా మారింది. ఇషా కిల్ల‌ర్ లుక్ అదిరింది అంటూ బోయ్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మునుప‌టితో పోలిస్తే ఇషా ఈ ఫోటోగ్రాఫ్ లో స్ట్రైకింగ్ లుక్స్ తో ఆక‌ర్షిస్తోంది. బాడీ హ‌గ్గింగ్ డ్రెస్ లో థై ఎలివేష‌న్ తో ఇషా మ‌తులు చెడ‌గొడుతోంద‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇషా ఇటు తెలుగు ప‌రిశ్ర‌మ‌తో పాటు త‌మిళం- మ‌ల‌యాళంలోనూ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.