Begin typing your search above and press return to search.
ఇక్కడా నెపొటిజం ఉందన్న ఈషా కాని..!
By: Tupaki Desk | 26 July 2020 10:50 AM GMTసుశాంత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా నెపొటిజంపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఉన్న నెపోటిజం వల్ల ఇతరులకు ఆఫర్లు రావడం లేదని కొత్త వారు వస్తే చాలా కష్టాలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం అవుతుంది. బాలీవుడ్ లో ఉన్న కొన్ని ఫ్యామిలీలు వారికి చెందిన వారిని మాత్రమే 24 క్రాఫ్ట్స్ లోనూ ఎంకరేజ్ చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం బాలీవుడ్ కే పరిమితం అవ్వలేదు. అన్ని భాషల్లో కూడా వారసులే చక్రం తిప్పుతున్నారు.
తాజాగా తెలుగు అమ్మాయి హీరోయిన్ ఈషా రెబ్బా నెపొటిజంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. టాలీవుడ్ లో కూడా నెపొటిజం ఉంది. ఇక్కడ లేదని నేను అనడం లేదు. బ్యాక్ గ్రౌండ్ ఉండటం వల్ల అవకాశాలు రావడం ఈజీ. కాని బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెస్ రాదు. ట్యాలెంట్ ఉంటే మాత్రమే ఇండస్ట్రీలో కొనసాగుతారు. ట్యాలెంట్ లేకుండా ఎంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా ఆ బ్యాక్ గ్రౌండ్ వృదానే అవుతుంది. బ్యాక్ గ్రౌండ్ లేని వారికి ఆఫర్లు కాస్త తక్కువ వచ్చినా.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతిభ కనబర్చితే ఖచ్చితంగా మంచి గుర్తింపు లభిస్తుందని ఈషా చెప్పుకొచ్చింది.
తాజాగా ఈమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి కరోనా నివారణ చర్యల్లో భాగంగా మాస్క్ ధరించాలనే సందేశంతో ఒక వీడియోను చేసింది. చిరంజీవి గారు నా పేరును సూచించారని తెలిసి ఆశ్చర్యపోయాను. మాస్క్ ధరించడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంత అవసరమో చిరంజీవి గారు చెబితే వింటారని నేను అనుకున్నాను. అందుకే చిరంజీవి గారితో ఈ వీడియో చేయడం చాలా గౌరవంగా భావించి ఇంట్లోనే ఉండి చేశాను.
నేను అనుకున్నట్లుగానే చిరంజీవి మాటలతో చాలా మంది మార్పు కనిపిస్తుందని ఈషా పేర్కొంది. ప్రస్తుతం నటిస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ తమిళంలో చేసిన సినిమా విడుదలకు రెడీగా ఉంది. కొందరు దర్శకులు ఈమద్య ఆన్ లైన్ ద్వారా కథలు వివరించారు. త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుని.. కరోనా భయం తగ్గిన తర్వాత షూటింగ్స్ కు జాయిన్ అవుతానంటూ చెప్పుకొచ్చింది.