Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కోసమే ఆ సినిమా చేశా
By: Tupaki Desk | 7 Dec 2018 3:34 AM GMT‘అరవింద సమేత’లో ఈషా రెబ్బా పాత్ర గురించి విడుదలకు ముందు రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇందులో సెకండ్ హీరోయిన్ అని.. ఎన్టీఆర్ కు చెల్లెలి పాత్ర అని.. ఇలా ఏవేవో మాట్లాడుకున్నారు. తీరా చూస్తే పూజా హెగ్డే సోదరిగా చాలా చిన్న పాత్ర చేసిందామె. సినిమాలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యం లేదు. కథానాయికగా చిన్న-మీడియం రేంజి సినిమాలే చేస్తున్నప్పటికీ మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తున్న ఈషా.. ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకుందా అని చాలామంది ఆశ్చర్యపోయారు. ఐతే తనకు మాత్రం ఈ పాత్ర చేసినందుకు ఎలాంటి రిగ్రెట్స్ లేవని అంటోంది ఈషా. ‘అరవింద సమేత’ ఎన్టీఆర్.. త్రివిక్రమ్ ల సినిమా అనే ఒకే కారణంతో తాను అందులో నటించానని ఈషా చెప్పింది.
‘‘చిన్నదైనా సరే.. నాకు ఆ పాత్ర నచ్చింది. ఎన్టీఆర్.. త్రివిక్రమ్ ల సినిమా అనగానే మరో ఆలోచన లేకుండా సినిమా ఒప్పుకున్నా. వాళ్ల కోసమే ఆ సినిమా చేశా. ఇది పెద్ద స్టార్ సినిమా. అందరూ ఎన్టీఆర్ కోసమే సినిమాకు వస్తారు. మనల్నీ చూస్తారు. నా పాత్ర చిన్నదనే భావనేమీ లేదు. చేసినంత వరకు సంతోషంగానే ఉన్నాను. ఈ పాత్ర నా కెరీర్ కు ఉపయోగపడిందా లేదా అన్నది కాదు.. ఆ సినిమాలో చేయాలనిపించి చేశాను’’ అని ఈషా చెప్పింది. మరోవైపు తెలుగమ్మాయిలకు తెలుగు పరిశ్రమలో పెద్దగా అవకాశాలు దక్కవనే అభిప్రాయంతో ఈషా విభేదించింది. ఇప్పుడు దర్శక నిర్మాతల ఆలోచన మారుతోందని.. మనమ్మాయిలకు బాగానే అవకాశాలు ఇస్తున్నారని అంది.
తెలుగమ్మాయిలకు టాలీవుడ్లో అవకాశాలుండవు. తమిళం లేదా కన్నడలో ప్రయత్నించండి అంటూ తనకు చాలామంది ఉచిత సలహాలు కూడా ఇచ్చారని అంది. మరాఠీ అమ్మాయి అయిన ప్రియాంక జవాల్కర్.. తెలుగు ప్రాంతంలోనే పెరిగి.. ఓ తెలుగమ్మాయిగానే ‘ట్యాక్సీవాలా’లో అవకాశం దక్కించుకోవడం గురించి ఈషా ప్రస్తావించింది.