Begin typing your search above and press return to search.
తెలుగు 'లస్ట్ స్టోరీస్'లో కేవలం 'లస్ట్' మాత్రమే ఉంటుందా..?
By: Tupaki Desk | 10 April 2020 12:30 PM GMTఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో వెబ్ సిరీస్ లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. హాలీవుడ్ లో ఎప్పటి నుంచో వీటి ట్రెండ్ నడుస్తున్నప్పటికీ మన దేశంలో కొంచం లేట్ గానే ఎంటర్ అయ్యాయని చెప్పవచ్చు. వెబ్ సిరీస్ అంటే ఏదో డైలీ సీరియల్ అనుకుంటే పొరపాటే. సినిమాకి ఏమి తీసిపోకుండా.. కొన్ని సార్లు సినిమాని మించి కూడా వెబ్ సిరీస్ నిర్మిస్తుంటారు. వీటిలో స్టార్ ఆర్టిస్టులు నటిస్తుంటారు. ఇంకో విషయమేమిటంటే వీటికి సెన్సార్ కూడా ఉండదు. మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ కూడా మారుతూ వస్తూ ఉంటుంది. ప్రస్తుతం సినీ రంగంతో పాటు డిజిటల్ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రేక్షకులు కూడా ఇంట్లో ఉండే వినోదం పొందడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండటంతో టాప్ స్టార్లు కూడా డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మన ఇండియన్స్ కి వెబ్ సిరీస్ మీద ఆసక్తి కలిగించేలా చేసింది మాత్రం 'లస్ట్ స్టోరీస్' అని చెప్పొచ్చు.
నెట్ ఫ్లిక్స్ లో రిలీజై సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్' అని చెప్పవచ్చు. ఈ వెబ్ సిరీస్ లో అమ్మాయిల్లో ఉండే సెక్సువల్ డిస్ప్లెజర్ గురించి చాలా బోల్డ్‌గా డిస్కస్ చేశారు. నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ప్లాట్ ఫార్మ్ గురించి సామాన్య ప్రేక్షకులకు కూడా తెలిసేలా చేసిందీ వెబ్ సిరీస్. మొత్తం నాలుగు భాగాలుగా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌ని అనురాగ్ కశ్యప్ - జోయా అక్తర్ - దిబాకర్ బెనర్జీ - కరణ్ జోహర్ డైరెక్ట్ చేశారు. రాధికా ఆప్టే నటించిన సిరీస్ కు అనురాగ్ కశ్యప్ - భూమి పడ్నేకర్ నటించిన సిరీస్ కు జోయా అక్తర్ - మనీషా కోయిరాలా నటించిన సిరీస్ కు దిబాకర్ బెనర్జీ - కియారా అద్వానీ నటించిన సిరీస్‌కు కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు. ఇందులో కియారా అద్వానీ - రాధికా ఆప్టే తదితరులు ఎంత బోల్డ్ గా నటించారో తెలిసిందే. ఇప్పుడు ఈ నాలుగు సిరీస్ లని తెలుగులో నెట్ ఫ్లిక్స్ రీమేక్ చేస్తోంది. ఇందులో ఒక భాగాన్ని 'ఘాజీ' ఫేమ్ సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. మిగతా మూడు భాగాల్ని నందినిరెడ్డి - తరుణ్ భాస్కర్ ఇటీవలే పూర్తి చేశారు. సంకల్ప్ రెడ్డి రూపొందిస్తున్న సిరీస్ కూడా షూటింగ్ పూర్తయింది. ఇంతులో కియారా తరహా పాత్రలో తెలుగమ్మాయి ఈషా రెబ్బా ననటిస్తున్నది. చాలా హాట్ సన్నివేశాల్లో ఇషా నటించినట్టు తెలిసింది. ఈ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నానని, ఇందులో తన పాత్ర చాలా బోల్డ్ గా వుంటుందని ఈషా రెబ్బా ఇంతకముందే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
‘లస్ట్ స్టోరీస్’ తెలుగు వెర్షన్ లో ఈషా నటిస్తోందనేసరికి.. ఒక్కసారిగా ఆమె ఇంత బోల్డ్ క్యారక్టర్ చేస్తుందా అని ఆశ్చర్యపోయారందరూ. ఈ సిరీస్‌లో ఆమె రెచ్చిపోయి నటిస్తుందనే అంచనాతో ఉన్నారు. అయితే తెలుగు ‘లస్ట్ స్టోరీస్’ కంటెంట్ పరంగా బోల్డ్ గానే ఉంటుందని.. కానీ వల్గారిటీ మాత్రం ఉండదని అంటోంది ఈషా. ఇందులో తానేమీ స్కిన్ షో చేయట్లేదని ఆమె స్పష్టం చేసింది. గ్లామర్ విషయంలో హద్దులు దాటకుండానే బోల్డ్ నెస్ చూపించినట్లు ఒక ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది. మొత్తం మీద ఇండియన్ వెబ్ సిరీస్ లలో సంచలనం సృష్టించిన ఈ 'లస్ట్ స్టోరీస్' మన తెలుగులో ఎన్ని సంచలనాలకు తెరదీస్తుందో చూడాలి.