Begin typing your search above and press return to search.
మనోళ్లు మారుతున్నారండోయ్!
By: Tupaki Desk | 7 Nov 2019 9:34 AM GMTతెలుగమ్మాయిలతోనే సౌకర్యం అంటూ వేదికలపై తెగ లెక్చర్లిస్తుంటారు మన దర్శకనిర్మాతలు. అయితే మన పరిశ్రమలో తెలుగమ్మాయిలు ఎందుకు తగ్గిపోతున్నారు? అంటూ ఇటీవల ఆవేదనను వ్యక్తం చేశారు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. ఒకప్పటితో పోలిస్తే తెలుగమ్మాయిలకు అవకాశాలు ఎందుకని రావడం లేదు? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలుగు గాళ్స్ విషయంలో పరిశ్రమలో మార్పు రాలేదా? అని ప్రశ్నించారు.
అందుకు స్పందనగానా? అన్నట్టే తెలుగమ్మాయ్ ఇషారెబ్బా ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో స్పందించింది. ఈ భామ నటించిన లేడీ ఓరియెంటెడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ `రాగల 24 గంటల్లో` ఈనెలలోనే సినిమా రిలీజవుతోంది. శ్రీనివాస రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో లీడ్ పాత్రలో నటిస్తోంది ఇషా రెబ్బా. నాయికా ప్రాధాన్యం ఉన్న పాత్రలో తనకు అవకాశం ఇచ్చారని తన దర్శకనిర్మాతల్ని ప్రశంసించిన ఈ భామ.. పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఎలా ఉన్నాయి? అన్నదానిపై స్పందించింది.
తెలుగమ్మాయిల విషయంలో ఇంకా పూర్తి స్థాయి న్యాయం జరగకపోయినా అవకాశాలు అయితే పెరిగాయని ఇషా అభిప్రాయపడింది. చాలా ఏళ్లుగా మన దర్శకుల నోటి నుంచి తెలుగమ్మాయిలకు ఛాన్సులిస్తామన్న మాట వింటూనే ఉన్నా.. చేతల్లో అలా లేదు. వేరే భాషల నాయికలనే తీసుకుంటున్నారని ఈ విషయంలో ఘననీయమైన మార్పు రాలేదని అంది ఇషా. తెలుగు మాట్లాడే అమ్మాయిలకు ఛాన్సులివ్వరు. అయితే ఇటీవల నవతరం దర్శకులు ఛాన్సులిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగు సినీపరిశ్రమలో మునుముందు పూర్తి మార్పు వస్తుందని నమ్ముతున్నా అని ఖరాకండిగా తన అభిప్రాయం తెలిపింది ఇషా. `రాగల 24 గంటల్లో` చిత్రంలో ఇంత మంచి పాత్రలో అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉన్నానని వెల్లడించింది.