Begin typing your search above and press return to search.

అది గాయ‌మేనా అమ్మాయ్?

By:  Tupaki Desk   |   27 Jun 2021 5:30 AM GMT
అది గాయ‌మేనా అమ్మాయ్?
X
తెలుగమ్మాయి ఈషా రెబ్బా సోష‌ల్ మీడియాల్లో ఎంత స్పీడ్ గా ఉంటారో తెలిసిన‌దే. నిరంత‌రం వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ.. త‌న‌ సినిమాల సంగ‌తుల‌పై అప్ డేట్స్ అందిస్తూ సోష‌ల్ మీడియా ఫ్యాన్స్ లో భారీగానే ఫాలోయింగ్ ని క‌లిగి ఉంది. స‌మ‌యం చిక్కిన‌ప్పుడు ఈ వేదిక ద్వారా అభిమానుల‌తో ముచ్చ‌టిస్తుంటుంది. ప్ర‌స్తుతం షూటింగ్ లు కూడా బంద్ అవ్వ‌డంతో ఈషా ఇంటికే అంకిత‌మైంది. ఆ క్ర‌మంలోనే అభిమానుల‌తో రెగ్యుల‌ర్ గానే ట‌చ్ లో ఉంది.

ఇన్ స్టా..ట్విట‌ర్ వంటి మాధ్య‌మాల ద్వారా కొత్త పాత ఫోటోల‌ను షేర్ చేస్తూ ఇండ‌స్ట్రీ స‌హా ఫ్యాన్స్ అటెన్ష‌న్ ని త‌న‌వైపు తిప్పేసుకుంటోంది. తాజాగా ఈషా షేర్ చేసిన ఓ ఫోటో అభిమానుల్లో హాట్ డిబేట్ కి తెర తీసింది.

ఈ ఫోటోలో ఈషా ఎడ‌మ భుజంపై ఎర్రగా కందిన గాయం క‌నిపిస్తోంది. అది గాయ‌మా లేక మచ్చా? అన్న డైల‌మా అభిమానుల్లో వ్య‌క్త‌మైంది. దేనినీ దాచుకోకుండా ఓపెన్ గా అలా ప్ర‌ద‌ర్శించిన ఈషాకు ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. అది ప్రేమ‌కు గుర్తుగా వ‌చ్చిందా.. మ‌రీ అంత హాట్ గానా? అంటూ ఓ అభిమాని ప్ర‌శ్నించాడు. దీనికి ఈషా ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి స‌మాధానం ఇవ్వ‌లేదు కానీ నెటి జ‌నుల‌ కామెంట్ మాత్రం సోష‌ల్ జ‌నాల్లో హాట్ టాపిక్ గా మారింది. అది గాయ‌మా .. ప్రేమ కానుకా? లేక టీకా వ‌ల్ల వ‌చ్చిన మ‌చ్చా? అన్న‌ది త‌నే చెబుతుందేమో చూడాలి. ఇప్ప‌టివ‌ర‌కూ ఈషా రెబ్బా ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌లేదు. అది గాయ‌మేనా కాదా అన్న‌ది కూడా ఈషానే చెప్పాలి.

అయితే కొంత మంది భుజాల‌పై వ్యాక్సినేష‌న్ కార‌ణంగా బొప్పి క‌ట్టింద‌ని అన్నారు. కొంద‌రైతే ఆ మ‌చ్చ మాత్రం వ్యాక్సినేష‌న్ వ‌ల్ల వ‌చ్చినది కాద‌ని కామెంట్ చేస్తున్నారు. టీకా అక్క‌డ వేయ‌రు క‌దా! దేనికీ టెన్ష‌న్ ప‌డే ప‌నిలేదని సూచిస్తున్నారు. అయితే అన్ని సందేహాల‌కు ఈషానే క్లారిటీ ఇస్తే బావుంటుందేమో! ప్ర‌స్తుతం ఈషారెబ్బా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ లో న‌టించింది. ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. త‌మిళ్ లో రెండు చిత్రాలు.. మ‌ల‌యాళంలో ఒక సినిమాలో న‌టిస్తోంది.