Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: స్టైల్ పెంచిన ఈషా

By:  Tupaki Desk   |   23 Nov 2018 12:34 PM GMT
ఫోటో స్టొరీ: స్టైల్ పెంచిన ఈషా
X
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కాస్త ఫామ్ లో ఉన్న తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా మాత్రమే. 'అంతకు ముందు ఆ తర్వాత' సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈషా 'అమీ తుమీ'.. 'అ!' లాంటి విజయవంతమైన చిత్రాలలో నటించింది. ఈ రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా 'అరవింద సమేత' లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈషా రెబ్బాకు పెద్దగా ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కలేదు కానీ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించే సత్తా ఉందని మాత్రం చాటింది.

ఇక రాబోయే సినిమాల విషయానికి వస్తే సుమంత్ హీరోగా నటిస్తున్న 'సుబ్రహ్మణ్యపురం' లో హీరోయిన్ గా నటిసొంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్.. ట్రైలర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే హిందీ భామలకేమీ తీసిపోనంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడమే కాకుండా గ్లామరస్ ఫోటోలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.

ఆ ఫోటోకు 'ఏం జరుగుతోంది?' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక డ్రెస్ ఎలా ఉందంటే.. మిక్స్ అండ్ మ్యాచ్. మెరూన్ కలర్ టాప్.. ష్రెడ్డెడ్ జీన్స్.. మెడకు ఒక స్టోల్ ను అలా స్టైల్ గా చుట్టుకుంది. ఈ డ్రస్ లో గోడకు అనుకుని అలా స్టైల్ గా నిలబడింది. మన తెలుగమ్మాయి స్టైల్ కు మంచి రెస్పాన్సే ఉంది. ఫోటోను పోస్ట్ చేసిన 16 గంటల్లోనే 37 వేలకు పైగా లైకులు వచ్చాయి.