Begin typing your search above and press return to search.
ఆఫర్లు లేకే నేచురల్ ఇండస్ట్రీ వైపు?
By: Tupaki Desk | 18 March 2021 4:37 AM GMTతెలుగమ్మాయిలకు తెలుగు సినీపరిశ్రమలో అవకాశాలు ఇవ్వరన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకు భిన్నంగా నేటితరం తెలుగమ్మాయిలకు వరుసగా ఆఫర్లు ఇస్తూ మన పరిశ్రమలో బోలెడంత స్కోప్ పెంచుతున్నారు. కానీ ట్యాలెంట్ ఉన్నా తెలుగమ్మాయి ఇషా రెబ్బా ఎందుకనో ఇక్కడ పూర్తిగా వెనకబడిపోతోంది.
ఎన్టీఆర్ `అరవింద సమేత` రేంజు ఆపర్ పడినా కానీ అందులో సెకండ్ లీడ్ కే అంకితమైంది. అటుపై మళ్లీ అగ్ర హీరోల సినిమాల్లో సరైన ఆఫర్లు లేవు. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలోనూ సహాయక పాత్రలో నటిస్తోంది.
కారణం ఏదైనా కానీ .. ప్రస్తుతం ఇషా చూపులు పొరుగు భాషలపై నే ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటు తమిళం అటు మలయాళంలో ఆఫర్ల కోసం వేటాడుతోందట. ఇటీవలే మలయాళ చిత్రం ఒట్టు కు సంతకం చేసింది. ఇందులో 44 ఏళ్ల కుంచాకో బోబన్ కథానాయకుడు. సహజసిద్ధమైన కథల్ని ఎంచుకుని అంతే సహజమైన పాత్రలతో అలరించే మల్లూ పరిశ్రమ ఇషాకు పిచ్చిగా నచ్చేస్తోందట. మరోవైపు నేటివిటీకి ప్రాధాన్యతనిచ్చే తమిళంలో జీవీ ప్రకాష్ సరసన అయిరమ్ జేన్మంగళ్ అనే చిత్రంలోనూ ఇషా నటిస్తోంది.
ఇక సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లతో ఇషా రెబ్బా హడావుడి గురించి తెలిసినదే. ఈ వేదికపై తన ఫాలోవర్స్ ని పెంచుకునేందుకు చాలానే తాపత్రాయ పడుతోంది. వేడెక్కించే ఫోటోషూట్లతోనే పొరుగు పరిశ్రమల్ని ఆకర్షిస్తోందట.