Begin typing your search above and press return to search.

చరణ్ - ఉపాసనల వివాహ బంధానికి ఎనిమిదేళ్లు..!!

By:  Tupaki Desk   |   14 Jun 2020 9:42 AM GMT
చరణ్ - ఉపాసనల వివాహ బంధానికి ఎనిమిదేళ్లు..!!
X
నేడు రామ్ చరణ్ - ఉపాసన ల పెళ్లి రోజు. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం అంటే 2012 జూన్ 14న తన ప్రేయసి ఉపాసన మెడలో మూడు ముళ్ళు వేసి ఓ ఇంటివాడయ్యాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పెళ్లి తర్వాత చరణ్ - ఉపాసనల జోడీ అన్యోన్యంగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. రామ్ చరణ్ ఓ వైపు తన సినిమాలతో బిజీగా ఉంటే.. మరోవైపు మెగా కోడలిగా అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ బాధ్యతలు నిర్వహిస్తూ.. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా గడిపేస్తోంది ఉపాసన. ఇక మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టిన ఉపాసన తన మంచి మనసునుతో కుటుంబ సభ్యుల మన్ననలు పొందుతూ వస్తోంది. ముఖ్యంగా మామ మెగాస్టార్ చిరంజీవి, అత్త సురేఖతో ఒక కోడలిగా కాకుండా స్నేహితురాలిగా ఉంటుందని చరణ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కాగా ఈ మధ్య ఇంటికే పరిమితమైన ఈ జంట సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులకు టచ్ లో ఉన్నారు. చరణ్ - ఉపాసనలు తమ విషయాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వస్తున్నారు. ఈ రోజు చరణ్ - ఉపాసన ల పెళ్లి రోజుని పురస్కరించుకొని సినీ ప్రముఖులు.. మెగా అభిమానులు సోషల్ మీడియా ద్వారా వారికి విషెస్ అందిస్తున్నారు.

కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వివాహబంధం గురించి స్పందించిన ఉపాసన.. తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడం అదృష్టమని.. పెళ్లి తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని.. మెట్టినింటిలో అడుగుపెట్టాక జీవితంలో సర్దుబాటు అంటే ఏమిటో తెలిసిందని చెప్పుకొచ్చింది. అయితే చరణ్ - ఉపాసనల వివాహం జరిగి 8 ఏళ్ళవుతున్నా వీరు ఇంకా పిల్లల గురించి ఆలోచించకపోవడం మెగా అభిమానులకు కాస్త నిరాశను కలిగిస్తోందట. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి వీరు ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని గత కొన్నేళ్లుగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. హ్యాపీగా సాగిపోతున్న వీరి వివాహబంధంలో అదొక్కటే వెలితిగా మిగిలిపోయిందని వారు కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో చరణ్ సతీమణి ఉపాసన ఒక సందర్భంలో మాట్లాడుతూ.. ''పిల్లలు ప్రెగ్నెన్సీ అనేది మా పర్సనల్ విషయం. మాకు ఇప్పట్లో అలాంటి ఆలోచన అయితే లేదు. మా ఇద్దరికి ఈ విషయంలో ఒక ప్లాన్ ఉంది. పిల్లల్ని ఎప్పుడు కనాలనే విషయంలో కూడా ఒక క్లారిటీ ఉంది'' అని చెప్పింది. నిజానికి చరణ్ కి మరియు చిరు కి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా పిల్లలతో ఆడుకుంటూ ఆ విషయాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈ స్టార్ కపుల్స్ పిల్లల విషయంలో ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకుంటారా అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.