Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ తో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ..?

By:  Tupaki Desk   |   3 April 2020 5:30 AM GMT
సూపర్ స్టార్ తో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ..?
X
'సరిలేరు నీకెవ్వరూ' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు అదే ఊపులో తన నెక్స్ట్ సినిమా పట్టాలెక్కిస్తాడని అందరూ భావించారు. కానీ ఆ సినిమా విడుదలై ఇప్పటికి మూడు నెలలు కావొస్తుంది. కానీ ఇప్పటి వరకు సూపర్ స్టార్ తన తదుపరి సినిమా ప్రకటన చేయలేదు. ఇంతకు ముందు 'మహర్షి' లాంటి హిట్ అందించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ తన కెరీర్లో 27వ మూవీని స్టార్ట్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం కాలేదు. ఇప్పుడు లేటెస్టుగా 'గీత గోవిందం' సినిమా డైరెక్టర్ పరాశురాం మహేష్ నెక్స్ట్ సినిమా డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం బయటకి వచ్చింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇదే ఫైనలైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత చిత్రీకరణ ప్రారంభిస్తారని తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో మహేష్ పక్కన ఎవరు నటించబోతున్నారనే న్యూస్ కూడా ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. మొన్నటి దాకా కీయరా అద్వానీ అన్నారు, తర్వాత మహానటి కీర్తి సురేష్ అన్నారు. ఇప్పుడు తాజాగా ఇంకో బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ పేరు వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్ సూపర్ స్టార్ తో రొమాన్స్ చేయబోతుంది అనే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో హాల్ చల్ చేస్తోంది. సారా 'కేధారినాధ్' సినిమాతో బాలీవుడ్ కు పరిచయమై 'సింబా', 'లవ్ ఆజ్ కల్' సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సారా 'కూలీ నెంబర్ 1' లో నటిస్తోంది. మహేష్ బాబు పక్కన సారా అలీఖాన్ స్క్రీన్ షేర్ చేసుకుంటే ఇద్దరి జోడీ తెరపై బాగుంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి ఈ వార్తలు నిజమై ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ నటిస్తుందో లేదో చూడాలి.