Begin typing your search above and press return to search.

'ఏక్‌ మినీ కథ' ..డాక్టర్ సమరం లింక్

By:  Tupaki Desk   |   26 May 2021 7:30 AM GMT
ఏక్‌ మినీ కథ ..డాక్టర్ సమరం లింక్
X
ఓ కథ అది సినిమాకైనా పత్రికకైనా రాయాలంటే ప్రేరణ కావాల్సిందే. ఎక్కడో చోట ఐడియా అనే బీజం పడాల్సిందే. అయితే ఆ ఆలోచనా బీజం వచ్చిన విధానం ఒక్కోసారి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాంటిదే సంతోష్‌ శోభన్‌, కావ్య థాపర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఏక్‌ మినీ కథ' కథ ప్రేరణ విషయంలోనూ జరిగింది. డైరక్టర్ మేర్లపాక గాంధీ కథ అందించిన ఈ చిత్రానికి కార్తీక్‌ రాపోలు దర్శకత్వం వహించాడు. యూవీ కాన్సెప్ట్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది. ఇందులో హీరో చిన్నప్పటి నుంచే మానసిక సమస్యతో బాధపడుతూ ఉంటాడు.దాన్నుంచి అతడు ఎలా బయటపడ్డాడన్నదే అసలు కథ. అసలు ఆ సమస్య ఏమిటి..దానికి ప్రేరణ ఎలా పుట్టిందనే విషయం గురించి కథ ఇచ్చిన మేర్లపాక మురళి వివరించారు.

మేర్లపాక మురళి మాట్లాడుతూ... ఇది అంగం చిన్నది అనే ఆలోచనతో మధన పడే కుర్రాడి కథ. ఈ స్టోరీ ఐడియా నాకు ఓ పత్రికలో కాలం చదువుతున్నప్పుడు వచ్చింది. నేను కుర్రాడుగా ఉన్నప్పుడు స్వాతి మ్యాగజైన్ చదివేవాడిని. అందులో డాక్టర్ సమరం గారు పాఠకుల పర్శనల్ ప్రశ్నలకు సమాధానం ఇస్తూండేవారు. లాస్ట్ ఇయిర్ లాక్ డౌన్ టైమ్ లో యాక్సిడెంటల్ గా ఆ పుస్తకాల్లో కాలమ్ చూడటం జరిగింది. పదేళ్ల క్రితం నాటి సంచికలో ఓ వ్యక్తి ..తను అంగం చిన్నదిగా ఉందనే సమస్యతో బాధపడుతున్నాడని,పరిష్కారం చెప్పమని అడిగాడు. దాంతో ఇంత అడ్వాన్సెడ్ రోజుల్లో కూడా ఇలాంటి సమస్యలతో సతమతమయ్యేవాళ్లు ఉంటారనిపించి, కథ రాసాను అని చెప్పుకొచ్చారు.

ఏక్ మినీ కథ ఈ నెల 27న ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవ్వబోతోంది. నిజానికి ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేద్దామనుకున్నారు కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడంతో ఓటిటి లోకి వచ్చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్‌ అనుబంధ సంస్థ అయిన యు.వి.కాన్సెప్ట్‌ పతాకంపై కార్తీక్‌ రాపోలు తెరకెక్కించారు. సంతోష్‌ శోభన్‌ హీరో. ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌: రవీందర్, ఛాయాగ్రహణం: గోకుల్‌భారతి, సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు, కూర్పు: సత్య.