Begin typing your search above and press return to search.

'ఏక్ మినీ కథ' ట్రైలర్: ప్రైవేట్ పార్ట్ 'సైజ్' చిన్నదని ఫీల్ అయ్యే యువకుడి కథ

By:  Tupaki Desk   |   21 May 2021 11:25 AM GMT
ఏక్ మినీ కథ ట్రైలర్: ప్రైవేట్ పార్ట్ సైజ్ చిన్నదని ఫీల్ అయ్యే యువకుడి కథ
X
సంతోష్‌ శోభన్‌ - కావ్య థాపర్‌ జంటగా నటించిన చిత్రం ''ఏక్ మినీ కథ''. ఈ చిత్రానికి దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించగా.. కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించాడు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. 'డజ్‌ సైజ్‌ మ్యాటర్‌?' అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ - మినీ టీజర్ లతో అసలు సినిమాలో మ్యాటర్ ఏంటని అందరూ ఆసక్తి కనబరిచేలా చేశారు. ఏప్రిల్‌ లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈనెల 27న ‘ఏక్‌ మినీ కథ’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

‘ఏక్‌ మినీ కథ’ ట్రైలర్ లోకి వెళ్తే సంతోష్ తన ''సైజ్'' చిన్నదనే ఇన్ సెక్యూర్ ఫీలింగ్ లో ఉంటాడు. 'డౌట్ సబ్జెక్ట్ లో కాదు.. నా డ్రాయర్ లో' అంటూ చిన్నప్పటి నుంచే దాని గురించి ఆలోచిస్తున్నట్లు చూపించారు. ఇలాంటి మానసిక సమస్యతో బాధపడుతున్న అతను దీనికి పరిష్కారం కోసం స్ట్రగుల్ అవుతూ పెళ్లి చేసుకోకుండా ఉండాలని నిర్ణయించుకుంటాడు. అయితే అమృత అనే అమ్మాయి తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు?, అతని 'స్మాల్ సైజ్' కు పరిష్కారం దొరికిందా లేదా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

జీవితంలో 'చిన్న' విషయాలు పెద్ద సమస్యలను ఎలా సృష్టిస్తాయనేది ఈ సినిమాలో ఫన్నీగా చెప్పబోతున్నారనేది ట్రైలర్ లోనే తెలుస్తోంది. యువతరం మెచ్చే విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా మొట్టమొదటి బోల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని పేర్కొన్నారు. 'ఇది నా చిన్న బైక్.. చాలా చిన్న జాబ్.. చిన్న సాలరీ.. ఇవే కాకుండా చెప్పలేని చిన్నవి నా లైఫ్ లో చాలా ఉన్నాయి' అంటూ హీరోయిన్ తో హీరో చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తోంది. సైజ్ ఎంత పెంచాలి అనే దాని గురించి పోసాని - సంతోష్ మధ్య వచ్చే డిస్కషన్ ఫన్నీగా ఉంది.

'ఏక్ మినీ కథ' సినిమా ట్రైలర్ ఫన్నీ గా ఆసక్తికరంగా సాగింది. ఇందులో శ్రద్ధాదాస్ కీలక పాత్ర పోషిస్తుండగా.. బ్రహ్మాజీ - సుదర్శన్ - పోసాని కృష్ణ మురళి - హర్షవర్ధన్ - సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూర్చగా.. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించగా.. సత్య ఎడిటింగ్ చేశారు. మే 27న రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తోందో చూడాలి.