Begin typing your search above and press return to search.

సో, ఇదొక హిట్టు ఫార్ములా!!!

By:  Tupaki Desk   |   8 April 2015 3:30 AM GMT
సో, ఇదొక హిట్టు ఫార్ములా!!!
X
పునర్జన్మల నేపథ్యంలో కథలు అల్లి బ్లాక్‌బస్టర్‌ హిట్లు కొట్టడం వెండితెరకి కొత్తేమీ కాదు. ఈ రీ-ఇన్‌కార్నేషన్‌ కాన్సెప్టులో వచ్చిన చాలా సినిమాలు పెద్ద హిట్లే. ఎందుకంటే ఆడియన్స్‌ ఒక హీరోనో, హీరోయిన్‌నో ఒకే ఫార్మాట్‌లో కాకుండా ఓ ఎండు మూడు స్టయిల్స్‌లో చూడాలని అనుకోవడం, అందుకు తగ్గట్లే ఒక పాత్రలో సైలెంట్‌గా ఉన్న హీరోలు, మరో జన్మలో రచ్చ చేయడం.. ఇలాంటివి చేయడం వలన ఈ పునర్జన్మల సినిమాలు ఫుల్‌ హిట్టు.

రీసెంట్‌ సినిమాల్లో 'మనం' అద్భుతమైన క్లాసిక్‌ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో మూడు తరాల హీరోల్ని దర్శకుడు విక్రమ్‌కుమార్‌ చూపించిన తీరు విమర్శకుల్ని మెప్పించింది. అంతకంటే ముందే ఏఎన్నార్‌- సావిత్రి జంటగా నటించిన 'మూగమనసులు' ఆరోజుల్లో ట్రెండ్‌ సెట్టర్‌. పాత సినిమాల్లోనే 'దేవుడు చేసిన మనుషులు' కూడా పునర్జన్మల నేపథ్యంలో వచ్చినదే. నాగార్జున-విజయశాంతి జంటగా నటించిన 'జానకి రాముడు' పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా. రామ్‌చరణ్‌ 'మగధీర' పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కి టాలీవుడ్‌లో రికార్డులు సృష్టించింది. ఇటు తెలుగుతో పాటు అటు బాలీవుడ్‌లోనూ నాటి మేటి క్లాసిక్స్‌ నుంచి నేటి ట్రెండ్‌ వరకూ ఆ జోనర్‌లో సినిమాలు వస్తూనే ఉన్నాయి. లేటెస్టుగా సన్నీలియోన్‌ నటించిన 'ఏక్‌ పహేలీ లీలా' కూడా పునర్జన్మల నేపథ్యంలో ఆకట్టుకునే సినిమా అని ప్రచారం సాగిస్తున్నారు.

ఈ సినిమా కంటే ముందే వచ్చిన బాలీవుడ్‌ సినిమాల జాబితాని పరిశీలిస్తే బాద్‌షా షారూక్‌ ఖాన్‌ నటించిన 'ఓం శాంతి ఓం' పునర్జన్మల నేపథ్యంలోని సినిమా. షారూక్‌, సల్మాన్‌ హీరోలుగా నటించిన 'కరణ్‌ అర్జున్‌' కూడా పునర్జన్మల నేపథ్యంలో సినిమా. సంజయ్‌కపూర్‌-టబు జంటగా నటించిన ప్రేమ్‌ ఇదే కాన్సెప్టులో రిలీజై పెద్ద విజయం సాధించింది. సో, ఇదొక హిట్టు ఫార్ములా!!!