Begin typing your search above and press return to search.
వావ్.. 20 కోట్లు కొల్లగొట్టేసిన చిన్నవాడు
By: Tupaki Desk | 26 Nov 2016 4:29 PM GMTపెద్ద నోట్ల రద్దుతో సినిమా రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో అనూహ్యమైన కలెక్షన్లతో అదరగొట్టింది చిన్న సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’. ఫస్ట్ డే ఓపెనింగ్స్ దగ్గర్నుంచి ఆశ్చర్యపరుస్తూ వస్తున్న ఈ చిత్రం వారం రోజుల్లో రూ.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించడం విశేషం. తొలి ఏడు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.20.27 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. షేర్ రూ.12 కోట్లకు పైగానే ఉంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం రూ.15.6 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసింది. నైజాం ఏరియాలో మాత్రమే రూ.5.8 కోట్లు వసూలయ్యాయి. ఆన్ లైన్ బుకింగ్స్ ఎక్కువగా ఉండే ఏరియా కాబట్టి ఇక్కడ కలెక్షన్లపై అస్సలు ప్రభావం కనిపించలేదు. మామూలు టైంలో పాజిటివ్ టాక్ ఉన్న సినిమాకు ఎలాగైతే కలెక్షన్లు వస్తాయో.. దీనికీ అలాగే వచ్చాయి. సీడెడ్లో రూ.1.4 కోట్లు.. వైజాగ్ ఏరియాలో రూ.3.7 కోట్లు.. ఆంధ్రాలోని మిగతా ఏరియాలన్నీ కలిపి రూ.5 కోట్ల దాకా గ్రాస్ వసూలైంది.
అమెరికాలో ‘ఈపీసీ’కి అనూహ్యమైన వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం ఇప్పటికే హాఫ్ మిలియన్ మార్కును దాటేసింది. దాదాపు 6 లక్షల డాలర్ల దాకా వసూళ్లు వచ్చాయి. రెండో వీకెండ్లోనూ మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫుల్ రన్లో అక్కడ ఈ చిత్రం మిలియన్ మార్కును దాటేసినా ఆశ్చర్యం లేదు. మొత్తంగా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ రూ.30 కోట్ల గ్రాస్ వసూలు చేసేలా ఉంది.