Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: 21 గ్రాములతో ఎక్కడికి పోతావు
By: Tupaki Desk | 16 Oct 2016 4:56 AM GMTడిఫరెంట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నిఖిల్. మొదట హ్యాపీడేస్ నిఖిల్ అనిపించుకున్న ఈ హీరో.. ఇప్పుడు సొంతగానే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించేసుకున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ త్వరలో ప్రేక్షకులను పలకరించనుండగా.. ఇప్పుడా మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది.
టీజర్ ప్రారంభంలోనే మరణం దేహానికే కానీ ఆత్మకు కాదు.. అంటూ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో.. సినిమా థీమ్ ఏంటో చెప్పేయడం మెయిన్ పాయింట్. మనిషి బతికున్నప్పటి కంటే చనిపోయిన తర్వాత 21 గ్రాముల బరువు తగ్గుతాడు అంటూ పజిల్ విసరగా.. చివర్లో చెప్పిన డైలాగ్స్ ప్రకారం అయితే.. మనిషి శరీరంలోంచి బయటకు వెళ్లే ఆత్మ బరువు 21 గ్రాములు ఉంటుంది అనే ఇండికేషన్ ఇచ్చారు. ఎప్పటిలాగే ఓ డిఫరెంట్ థీమ్ ను ఎంచుకోవడంలోనే నిఖిల్ సగం సక్సెస్ సాధించేశాడు. మోషన్ పోస్టర్ నుంచి ఆసక్తి కలిగిస్తున్న సీసాను ఈసారి కాస్త ఎక్కువసేపు చూపించగా.. అందులో ఆత్మను చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
వీఐ ఆనంద్ డైరెక్షన్ లో క్రియేట్ చేసిన విజువల్స్ చూస్తుంటే.. ప్రతీ ఫ్రేమ్ అబ్బురపరిచేస్తుంది. చిన్న హీరో సినిమా అని ఏ యాంగిల్ లోనూ అనిపించనంత రిచ్ గా విజువల్స్ ఉన్నాయి. ప్రేమ.. పగ.. భయం అంటూ రకరకాల యాంగిల్స్ ని చూపించగా.. ప్రేమ నుంచి తప్పించుకోవడం కుదరదంటూ ఓ స్ట్రాంగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నిఖిల్ కి బాగా అచ్చొచ్చిన కొత్త ప్రయోగాలు.. ఈసారి కూడా వర్కవుట్ అయేట్లుగానే ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/