Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: లేడీ నిర్మాత సేవలకు పద్మశ్రీ ఇచ్చారు!
By: Tupaki Desk | 8 Nov 2021 11:30 PM GMTఆమె ఎంపికలే బోల్డ్ అండ్ నాటీ..! పెద్ద తెరపై కమర్షియల్ గా కాసుల వర్షం కురవాల్సిందే. న్యూడిటీ లేనిదే ఆమె సినిమాలు తీయదు. అయితే అందుకు భిన్నంగా టీవీ రంగంలో ఎందరికో ఉపాధిని కల్పిస్తూ సేవలందిస్తున్నారు. కళాకారులకు అవకాశాలు కల్పిస్తున్నారు. అందుకే ఆమెకు పద్మశ్రీ ఇచ్చారు. ఎంచుకున్న రంగంలో నిజాయితీగా సేవలు చేసినందుకు దక్కిన గౌరవమిది. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఏక్తా కపూర్ ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును అందుకుంది.
నవంబరు 8న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రదర్శన కళల రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు నిర్మాత ఏక్తా కపూర్ ప్రతిష్టాత్మక నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ తో సత్కరించారు. టెలివిజన్- చలనచిత్రాలు - డిజిటల్ కంటెంట్ రంగంలో ఆమె అద్భుతమైన సహకారం అందించినందుకు కపూర్ ను సత్కరించారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకకు ఏక్తా తన తండ్రి జీతేంద్రతో కలిసి వచ్చారు. తాజాగా #ఏక్తా కపూర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ రంగంలో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును అందుకుంటున్న ఫోటోలు వైరల్ గా మారాయి.
ఈ గొప్ప విజయంపై తన భావోద్వేగాలను ఏక్తా మీడియాతో పంచుకున్నారు. ``ప్రదర్శక కళల రంగంలో నా వినయపూర్వకమైన కృషికి నాల్గవ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకోవడం ఒక సంపూర్ణ గౌరవం. ఇది ఒక అసాధారణ క్షణం.. చాలా గర్వించదగ్గ విషయం. ఈ గౌరవ బ్యాడ్జ్ ని నా రెండు శక్తి స్తంభాలకు అంకితం చేస్తాను. మా అమ్మ - నాన్నకు ఇది అంకితం. వారు నన్ను సంపూర్ణహృదయంతో విశ్వసించారు. వారి కారణంగానే నేను ఈ స్థాయిలో ఉన్నాను!`` అంటూ ఉద్వేగానికి లోనయ్యారు ఏక్తా.
ఏక్తా ఇంకా ఇలా అన్నారు. ``నాపై కురుస్తున్న ప్రేమ .. ప్రశంసలతో నేను నిజంగా ఆనందంలో మునిగిపోయాను. నా కుటుంబం,.. స్నేహితులు, .. బాలాజీ టెలిఫిల్మ్స్‌లోని నా బృందానికి ముఖ్యంగా - ప్రేక్షకులకు.. నన్ను నమ్మి ఆదరించినందుకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నేను ఎల్లప్పుడూ రొటీనిటీని వదిలేయాలని నిబంధనలను సవాలు చేయాలని.. ప్రతిభావంతులకు నిజంగా అర్హతమేర వేదికను ఇవ్వాలని.. గర్వాన్ని కలిగించాలని.. ఆశపడ్డాను. నా ఆశయం కలలకు ఆజ్యం పోసిన దేశానికి తిరిగి ప్రతిదీ ఇవ్వాలని ఆశిస్తున్నాను`` అని అన్నారు.
ఏక్తా కపూర్ అభిమానులు ప్రేక్షకులు నిర్మాతగా ఆమె ఎదుగుదలను ఇష్టపడ్డారు. ప్రారంభం నుండి ఆమె అద్భుతాలు చేశారు. అమితాబ్ బచ్చన్ - కరీనా కపూర్ ఖాన్- కార్తీక్ ఆర్యన్- జాన్ అబ్రహం- అర్జున్ కపూర్- దిశా పటానీ- తారా సుతారియా వంటి అనేక మందితో ఆమె వరుస ప్రాజెక్ట్ లను నిర్మిస్తున్నారు. 2021-2022 మధ్య పెద్ద స్టార్లతో సినిమాలు చేస్తున్నారు. ఆమెకు టన్నుల కొద్దీ ప్రణాళికలు ఉన్నాయి, ఇప్పుడు ఈ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఏక్తా తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకుంది.