Begin typing your search above and press return to search.

మోదీ బ‌యోపిక్.. మ‌ళ్లీ ఏమైంది?

By:  Tupaki Desk   |   10 April 2019 1:36 PM GMT
మోదీ బ‌యోపిక్.. మ‌ళ్లీ ఏమైంది?
X
ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న‌ప్పుడు రాజ‌కీయ నాయ‌కుల బ‌యోపిక్ లు రిలీజ్ చేయ‌కూడ‌దా? రిలీజ్ చేస్తే అవి ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తాయా? అంటే అవున‌నే రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. అందుకే ఈ ఎన్నికల సీజ‌న్ లో రిలీజ‌వుతున్న రాజ‌కీయ నాయ‌కుల బ‌యోపిక్ ల రిలీజ్ ల‌కు అడ్డంకులు త‌ప్ప‌డం లేదు. ప్ర‌స్తుతం దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై తెర‌కెక్కించిన బ‌యోపిక్ `పీఎం న‌రేంద్ర మోదీ` రిలీజ్ కి ర‌క‌ర‌కాలుగా అడ్డంకులు ఎదుర‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ బ‌యోపిక్ రిలీజ్ ని అడ్డుకునేందుకు ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు కోర్టుల ప‌రిధిలో పోరాడారు. చివ‌రికి నిన్న‌టి రోజున ఈ బ‌యోపిక్ రిలీజ్ కి ఎలాంటి అడ్డంకులు లేవ‌ని.. య‌థేచ్ఛ‌గా రిలీజ్ చేసుకోవ‌చ్చ‌ని దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంలో తీర్పు వెలువ‌డింది. ఆ వెంట‌నే మోదీ పాత్ర‌ధారి వివేక్ ఒబేరాయ్ ఎంతో ఆనందం వ్య‌క్తం చేశారు. ప్ర‌జాస్వామ్య దేశంలో న్యాయ‌స్థానాల తీర్పునకు ఎంతో గౌర‌వం ఉంది. మీ ఆశీస్సులు... స‌పోర్ట్.. ప్రేమ మాకు ద‌క్కింది. అందుకు న్యాయ‌స్థానాల‌కు ధ‌న్య‌వాదాలు. సినిమాని ఇక రిలీజ్ చేస్తున్నాం.. అంటూ ఎగ్జ‌యిట్ అయ్యారు.

అయితే ఇంత‌లోనే హంస‌పాదు ఎదురైంది. తిరిగి ఈ సినిమా ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ ముంగిట‌కు వ‌చ్చింది. మోదీ బ‌యోపిక్ ని రిలీజ్ చేస్తే ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంద‌ని, లోక్ స‌భ ఎన్నిక‌లు పూర్తయ్యేవ‌ర‌కూ రిలీజ్ చేయ‌కూడ‌ద‌ని ఈసీ ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌న‌మైంది. ప్ర‌స్తుతం ఈసీ తీరుపై జ‌నంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ నిర్ణ‌యం క‌రెక్టేనా? సుప్రీం నిన్న‌టిరోజున ఇచ్చిన తీర్పులో సినిమా రిలీజ్ విష‌య‌మై ఓ మెలిక పెట్టింది. ఇప్ప‌టికే కోర్టు స‌మ‌యం బోలెడంత వృధా అయ్యింది. ఈసీకి ఎలాంటి అభ్య ంత‌రం లేక‌పోతే రిలీజ్ చేసుకోవ‌చ్చు అని మెలిక వేయ‌డంతో ప్ర‌స్తుతం ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ కు కొర‌డా ఝ‌లిపించే అవ‌కాశం ఇచ్చిన‌ట్ట‌యింద‌ని మేక‌ర్స్ వాపోతున్నారు. దీంతో మోదీ బ‌యోపిక్ రిలీజ్ పై మ‌ర‌సారి నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. ఇప్ప‌టికే ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఏప్రిల్ 11 లేదా 12న రిలీజ్ చేస్తున్నామ‌ని అన్నారు. అయితే తాజా లోక్ స‌భ ఎన్నిక‌లు పూర్త‌య్యేవ‌ర‌కూ ఈ సినిమాని రిలీజ్ చేయ‌కూడ‌ద‌ని ఈసీ అంటోంది. దీంతో ఈ డైలమా ఇప్ప‌ట్లో కియ‌ర్ అయ్యేట్టు లేద‌ని అర్థ‌మ‌వుతోంది.