Begin typing your search above and press return to search.

మహానాయకుడికి ఎన్నికల బ్రేక్?

By:  Tupaki Desk   |   24 Nov 2018 10:38 AM GMT
మహానాయకుడికి ఎన్నికల బ్రేక్?
X
స్వర్గీయ నందమూరి తారకరామారావు ఆత్మకథతో రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ అయితే జరుగుతోంది కాని విడుదల విషయంలో ఫిలిం నగర్ లో జరుగుతున్న టాక్ ని బట్టి కొత్త అనుమానాలు మొలకెత్తుతున్నాయి. జనవరి 9న వచ్చే కథానాయకుడి తేది గురించి ఎలాంటి అనుమానాలు లేవు. ఆ మేరకు బయ్యర్లకు ఖచ్చితమైన సమాచారం ఇవ్వడంతో ధియేటర్ల కేటాయింపుకు సంబందించిన చర్చలు కూడా ఒక కొలిక్కి తెస్తున్నారు. పోటీ చాలా తీవ్రంగా ఉండబోతోంది కాబట్టి ప్రమోషన్ తో పాటు ఎన్టీఆర్ టీం ఈ విషయంలోనూ కాస్త ముందంజలో ఉన్నట్టు సమాచారం.

ఇక మహానాయకుడు ముందు చెప్పిన ప్రకారం జనవరి 24 రావాలి. కాని దానికి కట్టుబడి ఉండటం కన్నా వాయిదా వేసే ఆలోచనలో టీం ఉన్నట్టు ఫ్రెష్ అప్ డేట్. ఇది అధికారికంగా వచ్చిన న్యూస్ కాకపోయినా ఇది పూర్తిగా కొట్టిపారేయలేని కోణంలో ఒక విశ్లేషణ చెప్పుకోవచ్చు. కథానాయకుడికి మహానాయకుడికి కేవలం రెండు వారాల వ్యత్యాసం మాత్రమే ఉంటుంది. కథానాయకుడికి సూపర్ హిట్ టాక్ వస్తే ఎంత లేదన్నా మూడు నుంచి నాలుగు వారాల రన్ ఈజీగా వస్తుంది. కాని రెండు వారాలకే సీక్వెల్ వస్తే వసూళ్ళ మీద ప్రభావం ఉంటుంది. రెండో కారణం చూస్తే అప్పటికి ఇంకో ఐదు నెలల్లోనే ఎన్నికలు ఉంటాయి. మహానాయకుడు ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబందించిన సినిమా కాబట్టి అందులో చూపించే అంశాలు పాజిటివ్ గా అయినా మారొచ్చు లేదా ప్రత్యర్థులకు నెగటివ్ ప్రచారానికి వాడుకోవడానికి అయినా ఉపయోగపడవచ్చు.

పైగా సోషల్ మీడియా విపరీతంగా యాక్టివ్ గా ఉన్న తరుణంలో చిన్న వివాదం కూడా నీటి బుడగ సైజు నుంచి పారచ్యుట్ రేంజ్ లో వైరల్ అవుతోంది. పైగా 24వ తేది చాలా సినిమాలు పోటీకి నిలబడ్డాయి. ఇవన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలు పూర్తయ్యాక ప్రశాంతంగా మహానాయకుడిని రిలీజ్ చేసే ఆలోచనలో క్రిష్ అండ్ బాలయ్య ఉన్నట్టు సమాచారం. ఇది నిజమని నిర్ధారణ కావాలంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు చెబితే తప్ప స్పష్టత రాదు. అప్పటి దాకా వేచి చూద్దాం.