Begin typing your search above and press return to search.
'ఉర్ఫీ మల్టీవర్స్ విశ్వం'లో ఎల్లీ చేరిందా?
By: Tupaki Desk | 17 Nov 2022 4:58 AM GMTఇటీవల ప్రతి ఈవెంట్లో బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ సంచలనాల గురించి తెలిసిందే. ఇతర కథానాయికలతో పోలిస్తే తనని తాను బోల్డ్ లుక్ తో ఎలివేట్ చేసుకోవడంలో ఉర్ఫీ రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇటీవలి కాలంలో ఏ ఇతర కథానాయిక అయినా బోల్డ్ గా కనిపిస్తే చాలు వెంటనే ఉర్ఫీ జావేద్ లా దిగజారావ్!! అంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ - అనన్య పాండే- దిశా పటానీ మొదలు చాలా మంది యువకథానాయికలు ఇలాంటి కామెంట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది.
తాజాగా ప్రముఖ మోడల్ కం నటి ఎల్లీ అవ్ రామ్ కి ఈ సెగ తాకింది. ఓ ఈవెంట్ లో బోల్డ్ దుస్తులు ధరించినందుకు ఎల్లి అవ్రామ్ క్రూరంగా ట్రోలింగ్ కి గురైంది. నెటిజనులు ఈ బ్యూటీని ఉర్ఫీ జావేద్ తో పోల్చారు. ఎల్లి అవ్రామ్ గత రాత్రి ముంబైలో జరిగిన ఒక ఈవెంట్ కు హాజరు కాగా.. ఈవెంట్ కోసం ధరించిన దుస్తులు ఆన్ లైన్ లో విస్త్రత చర్చకు దారితీసింది. విదేశీ బ్యూటీ ఎల్లి అవ్రామ్ డిజైనర్ లుక్స్ కి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోషూట్లకు తరచుగా ప్రశంసలు అందుకుంటుంది.
కానీ ఈసారి కొంచెం భిన్నంగా ప్రత్యక్షమైంది. ముంబై ఈవెంట్ లో ఎల్లీ షో స్టాపర్ గా నిలిచింది కానీ ఈ బోల్డ్ అవతార్ చూశాక ఆన్ లైన్ లో చాలా చర్చ సాగింది. ఎల్లి ఎద అందాలను ఆరబోస్తూ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఫ్రాకులో మెరిసిపోయింది. ఈ ఫోటోషూట్ వీడియోని వీక్షించగానే చాలా మంది ఎల్లీని ట్రోల్ చేసారు. తనను ఉర్ఫీ జావేద్ తో పోల్చారు.
ఎల్లీని ట్రోల్ చేస్తూ ఒక వ్యక్తి ఇలా రాసాడు. ''నువ్వు చాలా అందంగా ఉన్నావు... ఈరోజుకి క్షమించండి... చాలా బ్యాడ్ డ్రెస్సింగ్'' అని కామెంట్ చేసారు. మరొకరు 'ఉర్ఫీ మల్టీవర్స్ విశ్వం' అని ఘాటైన వ్యాఖ్యను రాశారు. ఉర్ఫీ జావేద్ మెయిన్ జాబ్ చోడ్ డు కియా.. అని మరో వ్యక్తి కామెంట్ చేసాడు.
ఎల్లి అవ్రామ్ కెరీర్ మ్యాటర్ కి వస్తే.. మిక్కీ వైరస్ -మలాంగ్ లాంటి బాలీవుడ్ సినిమాలలో నటించింది. సల్మాన్ ఖాన్ టీవీ ప్రోగ్రాం బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొంది. ఇంతకుముందు సల్మాన్ భాయ్ బాడీగార్డ్ సినిమాలో కీలక పాత్రను పోషించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాక వరుస ఆఫర్లు అందుకుంది. ఇటీవల బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి గుడ్ బైలో ఒక కీలక పాత్రను పోషించింది. ఎల్లి అవ్రమ్ అమితాబ్ బచ్చన్ తో గుడ్ బై సెట్స్ లో కలిసి ఉన్న చిత్రాన్ని పంచుకుని ఇటీవల ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిలైన సంగతి తెలిసిందే.
ప్రయోగాల బ్యూటీ అందరికీ స్ఫూర్తి:
ఇంటర్నెట్ సంచలనం .. టెలివిజన్ నటి ఉర్ఫీ జావేద్ తన సాహసోపేతమైన డ్రెస్సింగ్ సెన్స్ కారణంగా తరచుగా ట్రోలర్లకు కేంద్రక ఆకర్షణగా మారింది. ఉర్ఫీ జావేద్ కి గణనీయమైన సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది. చాలామంది నుండి వ్యతిరేకత ఉన్నా ఉర్ఫీ తన ప్రయత్నాలను విడవకుండా తాను ఆశించినది సాధించుకుంటోంది.
గత సంవత్సరం ప్రత్యేకంగా Vootలో ప్రసారమైన బిగ్ బాస్ OTT షోలో పాల్గొన్న తర్వాత ఉర్ఫీ గొప్ప పేరు తెచ్చుకుంది. కరణ్ జోహార్ దీనికి హోస్టింగ్ చేసారు. రియాలిటీ గేమ్ షో నుంచి ఎనిమిదవ రోజు ఉర్ఫీ లిమినేట్ అయింది. అయినా నాటి నుంచి తన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా తనని తాను మలుచుకున్న తీరు ఆశ్చర్యకరం. కొన్ని రోజుల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో తన పేరు చూసి ఉచ్ఛారణ సరిగా లేదని పేర్కొన్న ఉర్ఫీ.. Uorfi అని స్పెల్లింగ్ మార్చుకోవాలని కూడా కోరింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.