Begin typing your search above and press return to search.

తడితడి అందాలతో దాహం తీర్చుతున్న ఎల్లీ బ్యూటీ!

By:  Tupaki Desk   |   8 March 2021 11:30 PM GMT
తడితడి అందాలతో దాహం తీర్చుతున్న ఎల్లీ బ్యూటీ!
X
భారతీయ చిత్రపరిశ్రమలో మెల్లగా విదేశీ సోయగాలజోరు రోజురోజుకి పెరుగుతూనే ఉంది. మనవాళ్ళు ఏదైనా డేర్ స్టెప్ తీసుకోవాలంటే వెనకాముందు ఆలోచిస్తారేమో.. కానీ విదేశీ వయ్యారాలు అలా కాదు. వాళ్లు అన్నిటికి సిద్ధపడే వేరే దేశాల మీద తమ అందాలతో దండయాత్ర చేసేందుకు బయలుదేరతారు. అందుకే విదేశీ వయ్యారాలకు సాదరంగా ఆహ్వానం పలుకుతారు మన మేకర్స్. ఈమధ్య ఏ సినిమాలో చూసినా ఐటమ్ సాంగ్ అనేది కామన్ అయిపోయింది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలలో ఐటమ్ సాంగ్స్ కి ఓ క్రేజ్ ఉంది. అందుకే ముఖ్యంగా గ్లామర్ ప్రియులు కోరుకునే అందాలను విదేశీ భామలు కాదనకుండా ఆడించేస్తుంటారు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తెల్లతోలు పాపలు మెరుస్తున్నారు. ఐటమ్ సాంగ్స్ మాత్రమే కాదు హీరోయిన్స్ కూడా అయిపోతున్నారు.

ఆ విధంగానే రాబోయే పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ జంటగా విదేశీ సోయగమే నటిస్తుంది. ఈ విధంగా ఇండియన్ ఇండస్ట్రీలో సత్తా చాటుతోంది స్వీడన్ సుందరి ఎల్లీ అవ్రామ్. తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోవచ్చు కానీ బాలీవుడ్ వారికీ సుపరిచితమే. అయితే తెలుగు 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే మూవీలో 'ఇరగ ఇరగ' ఆడిపాడింది. ఈ వయ్యారి కొన్నేళ్లుగా ముంబైలోనే ఉంటోంది. ఎల్లీకి గ్లామర్ షో అంటే చాలా ఇష్టమట. తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఓ పిక్ పెట్టింది. ఆ ఫోటోలో ఎల్లీని చూస్తే ఎంతటి మగవాడైనా దాసోహం అనాల్సిందే. అసలే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. నీటిధారలో అమ్మడు తడిసిన అందాలు చూస్తూ కుర్రాళ్లు మతులు పారేసుకుంటున్నారు. చూస్తుంటే కుర్రభామ వర్షానికి కూడా చెమటలు పట్టించేలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఆ పిక్ వైరల్ అవుతోంది.