Begin typing your search above and press return to search.

సంతోష్ శోభ‌న్‌.. ఏమంటి న‌బ‌యా వ‌చ్చేసింది!

By:  Tupaki Desk   |   18 Oct 2022 6:28 AM GMT
సంతోష్ శోభ‌న్‌.. ఏమంటి న‌బ‌యా వ‌చ్చేసింది!
X
'పేప‌ర్ బాయ్‌', ఏక్ మినీ క‌థ వంటి సినిమాల‌తో హీరోగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభ‌న్‌. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల‌తో బిజీగా వున్నాడు. ఇందులో మేర్ల‌పాక గాంధీ రూపొందిస్తున్న 'లైక్ షేర్ అండ్ స‌బ్ స్క్రైబ్‌' ఒక‌టి. విభిన్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందుతున్న ఈ మూవీని ఆముక్త క్రియేష‌న్స్ , నిహారిక ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్స్ పై వెంక‌ట్ బోయిన ప‌ల్లి నిర్మిస్తున్నారు.

'జాతిర‌త్నాలు' ఫేమ్ ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్ గా న‌టిస్తోంది. ఎంట‌ర్ టైన్ మెంట్ నేప‌థ్యంలో క్యాచీ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీని న‌వంబ‌ర్ 4న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌బోతున్నారు. సినిమా రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ ని మొద‌లు పెట్టేసింది. నితిన్ తో క‌లిసి చేసిన 'మాస్ట్రో' ఫ్లాప్ కావ‌డంతో మేర్ల‌పాక గాంధీ 'లైక్ షేర్ అండ్ స‌బ్ స్క్రైబ్‌' పై భారీ ఆశ‌లు పెట్టుకున్నాడు.

ఈ సినిమాతో ఎలాగైనా మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ లోకి రావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. సినిమా రిలీజ్ డేట్ ఫిక్స‌యిపోవ‌డంతో లిరిక‌ల్ వీడియోల‌ని చిత్ర బృందం వ‌న్ బై వ‌న్ రిలీజ్ చేయ‌డం మొద‌లు పెట్టింది.

ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం సంతోష్ శోభ‌న్‌, సోనియా కాశ్య‌ప్ పై చిత్రీకరించిన 'ఏమంటి న‌బ‌యా.. 'అంటూ సాగే మాసీవ్ ఐట‌మ్ నంబ‌ర్ లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు. పెంచ‌ల దాస్ సాహిత్యం అందించిన ఈ పాట‌ని మంగ్లీ ఆల‌పించింది.

ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం అందించాడు. ఫోక్ నంబ‌ర్ గా సాగే ఈ పాట‌కు భారు మాస్ట‌ర్ అదిరిపోయే స్టెప్పుల్ని కంపోజ్ చేశాడు. సోనియా కాశ్య‌ప్ గ్లామ‌ర్‌, సంతోష్ శోభ‌న్ స్టెప్పులు, పెంచ‌ల దాస్ అందించిన సాహిత్యం, ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం ఈ పాట‌కు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

ఇక ఈ పాట‌ని రైల్వే స్టేష‌న్ లో సాగే ఫోక్ సాంగ్ గా క‌ల‌ర్ ఫుల్ లొకేష‌న్ లో చిత్రీక‌రించారు. న‌వంబ‌ర్ 4న విడుద‌ల కానున్నఈ మూవీ మేర్ల‌పాక గాంధీ ని మ‌ళ్లీ స‌క్సెస్ బాట ప‌ట్టిస్తుందేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.