Begin typing your search above and press return to search.
అస్సాంలో ఎమర్జెన్సీ..కంగన్ పై నైట్ సీన్స్!
By: Tupaki Desk | 18 Nov 2022 4:18 AM GMTబాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో 'ఎమర్జెన్సీ 'తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1975-77 కాలం నాటి పరిస్థితుల్ని ఆధారంగా చేసుకుని కంగన స్వీయా దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు ఆద్యంతం అంచనాలు పెంచేసాయి. ఇదీరాగాంధీ పాత్రలో కంగన ఆహార్యం అదిరిపోయింది. అచ్చంగా ఇందిరగాంధీనే తలపించింది.
అంతకు ముందు 'తలైవా'లో అమ్మ జయలలిత పాత్ర ఆహార్యం విషయంలో తప్పటడుగులు పడినా..ఇందిర రోల్ విషయంలో మాత్రం కంగన తీసుకున్న ప్రతీ జాగ్రత్త కనిపిస్తుంది. దీంతో ఎమర్జెన్సీ చిత్రాన్ని కంగన ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అద్దం పడుతుంది. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ పూర్తయింది. చాలా వరకూ ఇందిర ఆ నాటి రోజుల్లో పర్యటించిన ప్రాంతాల్లోనే చాలా వరకూ షూటింగ్ జరుపుతున్నారు.
వీలైనంత వరకూ కథలో వాస్తవాల్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారుని యూనిట్ వర్గాలు అంటున్నాయి. కంగన స్వయంగా కథని సిద్దం చేసుకోవడంతో వాస్తవాలకు చాలా దగ్గరగానే సినిమా ఉంటుందని...కల్పితాలకు ఏమాత్రం ఛాన్స్ లేదని చెబుతున్నారు. దీనిలో భాగంగా నైట్ సీన్స్ కోసం ఎంతగా శ్రమిస్తున్నారు అన్నది తాజా సన్నివేశం అద్దం పడుతుంది.
ప్రస్తుతం షూటింగ్ అస్సాంలో జరుగుతోంది. అక్కడ కేవలం రాత్రి నేపథ్యంలో సాగే కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కొద్ది రోజులు గా యూనిట్ అస్సాంలో బస చేసి ఆ పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. పగటి పూటంతా విశ్రాంతి తీసుకుని కేవలం రాత్రి సమయంలోనే షూటింగ్ చేస్తున్నారుట. 75-77 కాలం నాటి పరిస్థితుల్లో ఇందిరా ఆ సమయంలో ప్రత్యకంగా ఆప్రాంతంలో సంచరించారుట.
ఈ నేపథ్యంలో అస్సాంలో నైట్ షూట్ ప్లాన్ చేసినట్లు యూనిట్ వర్గాల నుంచి తెలుస్తోంది. ఇంకా ఉత్తరాది -దక్షినాది ప్రాంతంలో కొన్ని ప్రదేశాల్లోనూ ఎమర్జెన్సీ షూటింగ్ చేయనున్నట్లు సమాచారం. ఇందులో అనుపమ్ ఖేర్..శ్రేయస్ తల్పడే.. మిలింద్ సోమన్..మహిమా చౌదరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీటిలో ప్రతీ రోల్ వేటికవి ప్రత్యేకంగా హైలైట్ అవుతాయని యూనిట్ వర్గాల సమాచారం.
అలాగే ఈ చిత్రాన్ని థియేటర్ రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీలో కి అందుబాటులోకి తీసుకురావాలన్నది కంగన ప్లాన్ గా సమాచారం. భారీ ఓటీటీ ఆపర్స్ రావడంతో కంగన ఈ రకమైన స్ర్టాటజీతో ముందుకు కదులుతున్నట్లు వినిపిస్తుంది. మరి ఓటీటీ రిలీజ్ నా? థియేట్రికల్ రిలీజ్ అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.