Begin typing your search above and press return to search.
బాహుబలి టీంపై జాతివివక్ష
By: Tupaki Desk | 26 April 2017 10:09 AM GMTబాహుబలి 2 ఫీవర్ ఇప్పుడు ఊపేస్తోంది. అటు మీడియాలోనూ.. ఇటు జనాల్లోనే ఈ సినిమా గురించే చర్చంతా. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అన్న ఆసక్తి ఒకవైపు.. టికెట్లను ఎలా సొంతం చేసుకోవాలన్న తపన మరోవైపు కనిపిస్తోంది. ఇలాంటి వేళ.. ఈ సినిమాకు సంబంధించిన ఒక కొత్త విషయాన్ని చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.
బాహుబలి టీంకు దుబాయ్‌లో అవమానం జరిగిదంటూ కొత్త విషయాన్ని వెల్లడించారు. బాహుబలి ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం ఇటీవల దుబాయ్ కు వెళ్లారు. ఈ టీంలో ప్రభాస్.. అనుష్క.. రాజమౌళి.. నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులు ఉన్నారు. వీరంతా దుబాయ్ నుంచి హైదరాబాద్ కు ఏమిరేట్స్ ఫ్లైట్ లో బయలుదేరారు. అయితే.. ఎయిర్ పోర్ట్ వద్దకు చేరుకున్న తర్వాత.. విమాన సిబ్బంది బాహుబలి టీంతో అమర్యాదకరంగా వ్యవహరించినట్లుగా శోభు పేర్కొన్నారు.
తాను ఏమిరేట్స్ ఈకే526 విమానంలో బయలుదేరామని.. గేట్ దగ్గరి ఫ్లైట్ సిబ్బంది తమతో అమర్యాదకరంగా వ్యవహరించారని.. జాతివివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసినట్లుగా అనిపించిందని ట్వీట్ చేశారు శోభు. తాను తరచూ ఏమిరేట్స్ ఫ్లైట్స్‌లో ప్రయాణిస్తానని..కానీ.. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని చెప్పుకొచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/