Begin typing your search above and press return to search.
#EMK VS #BB5 : సోషల్ మీడియాలో రచ్చ
By: Tupaki Desk | 7 Sep 2021 1:30 PM GMTతెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు రెండు పండుగలు ఒకేసారి అన్నట్లుగా ఎవరు మీలో కోటీశ్వరులు మరియు బిగ్ బాస్ లు ఒకే సారి ప్రసారం అవుతున్నాయి. ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు షో జెమిని టీవీలో టెలికాస్ట్ అవుతుండగా.. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోంది. ఈ రెండు షో లకు ఇండియాలో ముఖ్యంగా ఉత్తరాదిన భారీగా క్రేజ్ ఉంది. తెలుగు లో కూడా ఈ రెండు షో లు మంచి ఆధరణ దక్కించుకున్నాయి. కనుక ఒకేసారి రెండు రావడం వల్ల ప్రేక్షకులు రెండు షో లను ఎంజాయ్ చేస్తున్నారు. నిర్వాహకులు కూడా ప్రేక్షకులకు ఇబ్బంది లేకుండా షో టైమింగ్స్ ను అడ్జస్ట్ చేశారు. ఎన్టీఆర్ షో పూర్తి అయిన తర్వాత బిగ్ బాస్ షో ప్రారంభం అవుతుంది. నాగార్జున వచ్చే వీకెండ్స్ లో ఎన్టీఆర్ షో ఉండటం లేదు. మొత్తంగా రెండు షో లు పోటీ లేకుండా అన్నట్లుగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ పంచేందుకు టెలికాస్ట్ అవుతున్నాయి.
ఈ సమయంలో కొందరు సోషల్ మీడియాలో మా హీరో షో తోపు అంటే లేదా మా హీరో షో టాప్ అంటున్నారు. రెండు షో ల గురించి రెండు వైపుల వారు బ్యాడ్ కామెంట్స్ చేయడం కూడా చాలా కామన్ గా కనిపిస్తుంది. బిగ్ బాస్ ప్రారంభం అయ్యి మూడు రోజులు కాకుండానే కొందరు అభిమానులు ఎన్టీఆర్ షో ను జనాలు చూడటం లేదు.. మా అభిమాన హీరో షోను మాత్రమే చూస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు బిగ్ బాస్ కు మాత్రమే ఎన్టీఆర్ సెట్ అవుతాడు. కనుక వెంటనే బిగ్ బాస్ కు ఎన్టీఆర్ ను తీసుకు రావాలంటే డిమాండ్ చేస్తున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు షో కాన్సెప్ట్ సీనియర్ లు అయిన నాగార్జున కే సెట్ అవుతుందని.. అందుకే నాగ్ అటు వెళ్లి ఎన్టీఆర్ ఇటు రావాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. అది సాద్యం కాకపోయినా కూడా చాలా మంది ఈ విషయాన్ని షో నిర్వాహకులకు మరియు ఛానెల్స్ కు ట్యాగ్ చేసి మరీ కోరుకుంటున్నారు.
బిగ్ బాస్ అంటేనే సోషల్ మీడియాలో రచ్చ. అలాంటి బిగ్ బాస్ కు ఇప్పుడు ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు తోడు అయ్యింది. రెండు షో ల గురించి సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ మరియు ట్విట్టర్ లో రచ్చ చేస్తున్నారు. రెండు షో ల మద్య పోటీ గురించి చర్చిస్తూ రెండు షో లకు వస్తున్న రేటింగ్ గురించి మాట్లాడుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం శృతి మించుతుంది. కొందరు వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసుకుంటున్నారు. మరి కొందరు మాత్రం హుందాగా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో రచ్చను కొద్దిలో కొద్దిగా అయినా తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు.