Begin typing your search above and press return to search.

RRR ఆ ఆరు ఎమోష‌న‌ల్ సీన్స్ తో పీక్స్

By:  Tupaki Desk   |   13 March 2022 3:30 PM GMT
RRR ఆ ఆరు ఎమోష‌న‌ల్ సీన్స్ తో పీక్స్
X
పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ ఈనెల 25 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ - రామారావు- రాజ‌మౌళి బృందం ప్ర‌మోష‌న్ పీక్స్ లో ఉంది. ర‌ణం రౌద్రం రుదిరం ప్ర‌చారం చివ‌రి అంచెలో ఉంది. ఇక‌పై వ‌రుస‌గా విజువ‌ల్ గ్లింప్స్ తో వెబ్ ని హీటెక్కించ‌నున్నార‌ని స‌మాచారం.

తాజా స‌మాచారం మేర‌కు.. ఈ సినిమాకి సంబంధించిన కీల‌క‌మైన రెండు విష‌యాలు లీక‌య్యాయి. ఈ మూవీలో స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా ఎమోష‌న్ ని రగిలించే సీన్ల‌తో రాజ‌మౌళి తెర‌కెక్కించార‌ని తెలిసింది. స్వాతంత్య్ర పోరాట నేప‌థ్యం ఒక ర‌కంగా ఎమోష‌న్ ని ర‌గిలిస్తే.. సూప‌ర్ హీరో త‌ర‌హా లో చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ పాత్ర‌లు అంతే రంజుగా సాగుతాయ‌ట‌.

ఇక ఇందులో ఓ ఆరు ఎమోష‌న‌ల్ సీన్స్ మాత్రం హైలైట్ గా నిలుస్తాయ‌ని చెబుతున్నారు. థియేట‌ర్లో ప్ర‌తి ఆడియెన్ క‌నెక్ట‌య్యేందుకు ఈ సీన్లు ఉప‌క‌రిస్తాయ‌ని లీక్ అందింది. ఇది ఒక సింపుల్ స్టోరి. ఒక గిరిజ‌న యువ‌తి చుట్టూ తిరిగే క‌థాంశ‌మ‌ని ఇందులో వీరాధివీరుల పాత్ర ఏమిట‌న్న‌ది తెర‌పైనే చూడాల‌ని చెబుతున్నారు.

ఇక అల్లూరి సీతారామ‌రాజు.. కొమ‌రం భీమ్ పాత్ర‌లు క‌లుసుకుని స్వాతంత్య్ర పోరాటం సాగించార‌నే ఫిక్ష‌న‌ల్ ఎలిమెంట్ ని జోడించి ఈ చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని రాజ‌మౌళి - విజయేంద్ర ప్ర‌సాద్ బృందం ఆర్.ఆర్.ఆర్ తొలి ప్రెస్ మీట్ లోనే వెల్ల‌డించారు .

దుబాయ్ బెంగ‌ళూరులో భారీ ఈవెంట్లు

భారీ ప్ర‌మోష‌నల్ ఈవెంట్ల‌తో RRR బృందం రిలీజ్ ముందు వేడి పెంచే ప్ర‌య‌త్నంలో ఉంది. ఇంత‌కుముందు ముంబైలో ఈవెంట్ ని నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ వేదిక‌కు స‌ల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నిజానికి దుబాయ్ లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సల్మాన్ ని ఆహ్వానించేందుకు రాజమౌళి వెళ్లి ముంబైలో ప్రత్యేకంగా అత‌డిని కలిసారు.

కానీ కోవిడ్ కారణంగా ఈవెంట్ రద్దయింది. తరువాత ముంబైలో నిర్వహించారు. సల్మాన్ దీనికి హాజరయ్యారు. ఇప్పుడు అదే దుబాయ్ ఈవెంట్ హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ నెల 18న దుబాయ్ ఈవెంట్ ను ప్రత్యేకంగా నిర్వహించనున్నారని తెలిసింది. RRR మూవీని అట్టహాసంగా విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఈ దుబాయ్ ఈవెంట్ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాడు. ఇత‌ర ఈవెంట్లతో పోలిక లేకుండా వైవిధ్యంగా చేయాల‌న్న‌ది ప్లాన్. మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

దుబాయ్ ఈవెంట్ తో పాటు మ‌రో ఈవెంట్ చ‌ర్చ‌ల్లోకొచ్చింది. ఈ నెల 19న బెంగుళూరులోని చిక్కబళ్లాపూర్ లో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఇప్ప‌టికే తార‌క్ - చ‌ర‌ణ్ అభిమానుల్లో దీనిపై ఆస‌క్తి నెల‌కొంది. ప్రీఈవెంట్ కోసం ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు. ఎన్టీఆర్ - చ‌ర‌ణ్ న‌డుమ స్నేహం గురించి తెలిసిన‌దే. ఇదంతా ఫ్యాన్స్ మ‌ధ్య జోష్ అని భావించాలి. ఆర్.ఆర్.ఆర్ ప్ర‌పంచవ్యాప్తంగా ఈ నెల 25న‌ ప‌లు భాష‌ల్లో అత్యంత భారీగా విడుదల కానుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే థియేట‌ర్ల‌ను లాక్ చేసారు.

టికెట్ బుకింగుల్లో స్పీడ్..

తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ గా ఆర్.ఆర్.ఆర్ కోసం వేచి చూస్తున్నారు. బుకింగ్ లు వేడెక్కిస్తున్నాయి. తాజాగా RRR కోసం అమెరికాలో మరోసారి ముందస్తు బుకింగ్ ప్రారంభమైంది. దీనికి స్పంద‌న ఎలా ఉంటుంది? అని ఎదురు చూస్తుండ‌గా.. ఇప్ప‌టికే దెబ్బతిన్న థియేటర్ వ్యాపారం కోసం వెల్ కమ్ షాంపైన్ వంటి వేల టిక్కెట్లు వెంటనే అమ్ముడయ్యాయి.

మార్చి 24 ప్రీమియర్ ల నుండి భారీ సంఖ్యలో బిజినెస్ సాగుతోంది. విదేశాల్లోని ఈ హుషారు చూస్తుంటే.. ఇది భారతీయ థియేటర్ ల బుకింగ్ సామ‌ర్థ్యాన్ని పెంచ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. టెక్సాస్ - డల్లాస్ లోని గెలాక్సీ థియేటర్ లో జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని 75 టిక్కెట్ లను కొనుగోలు చేయ‌డం ఇటీవ‌ల హాట్ టాపిక్ అయ్యింది.

అలాగే రామ్ చర‌ణ్ అభిమానులు ఇప్ప‌టికే భారీగా టికెట్ల‌ను బుక్ చేశార‌న్న గుస‌గుస‌లు ఉన్నాయి. తారక్- చరణ్ అభిమానుల సంద‌డి మునుప‌టి కంటే ఊహించ‌నంత వైబ్రేంట్ గా ఉండ‌నుందని తాజా ప‌రిణామం చెబుతోంది. టికెట్ కొనుగోలులోనూ ఫ్యాన్స్ న‌డుమ పోటీత‌త్వం క‌నిపిస్తోంది.

ఆర్.ఆర్.ఆర్ విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్ద‌రు అగ్ర హీరోలు క‌లిసి న‌టించిన సినిమాగా ఆర్.ఆర్.ఆర్ కి ఎంతో ప్ర‌త్యేక ఇమేజ్ ఉంది. ఇక పాన్ ఇండియా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తో ఆ ఇద్ద‌రూ క‌లిసి రావ‌డం అన్న‌ది అన్ ఇమాజిన‌బుల్.

అందుకే ఆర్.ఆర్.ఆర్ కి ఇటు తెలుగు రాష్ట్రాల‌తో పాటు సౌత్ అంత‌టా ఉత్త‌రాదినా బ‌ల‌మైన మార్కెట్ ఏర్ప‌డింది. అన్నిచోట్లా ప్రీ బుకింగులపై బోలెడ‌న్ని అంచ‌నాలున్నాయి. బలమైన ప్రీ-సేల్స్ బాక్సాఫీస్ వద్ద కొత్త ఫిగ‌ర్స్ తో ప్రారంభమ‌వుతాయని తాజా స‌న్నివేశం చెబుతోంది. తారక్ పెద్ద తెరపై కనిపించి దాదాపు నాలుగు సంవత్సరాలు అయ్యింది.

చ‌ర‌ణ్ న‌టించిన స‌క్సెస్ ఫుల్ సినిమా రంగ‌స్థ‌లం విడుద‌లై చాలా గ్యాప్ వ‌చ్చింది. త‌దుప‌రి విన‌య విధేయ రామా తీవ్రంగా నిరాశ‌ప‌రిచాక ఇప్పుడు `ఆచార్య` ఇంకా ఆల‌స్య‌మైంది. అందువ‌ల్ల చ‌ర‌ణ్ అభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా ఉన్నారు. రాజమౌళి ఫ్యాన్స్ ఈసారి విజువ‌ల్ మ్యాజిక్ ఏ రేంజులో ఉంటుందో అంటూ ఊహాగానాల్లో ఉన్నారు.