Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బరువెక్కిన గుండెతో పంపిస్తాడట

By:  Tupaki Desk   |   22 Dec 2015 9:21 AM GMT
ఎన్టీఆర్ బరువెక్కిన గుండెతో పంపిస్తాడట
X
ఎలాంటి సన్నివేశం అయినా యంగ్ టైగర్ ఎమోషన్స్ సూపర్బ్ గా ఉంటాయి. కొన్ని రకాల ఫీలింగ్స్ ఇవ్వడంలో, డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్ ఎమోషన్స్ ని మ్యాచ్ చేయడం కష్టమని అందరూ అంగీకరిస్తారు. టెంపర్ మూవీ కోర్ట్ సీన్ లో అందరికీ శిక్ష వేశాక.. ఎన్టీఆర్ ఇచ్చే ఒక్క ఫీల్ చాలు, ఈ స్టార్ హీరో ట్యాలెంట్ అర్ధం కావడానికి.

ఇప్పుడు నాన్నకు ప్రేమతో అంటూ టైటిల్ లోనే సెంటిమెంట్ కురిపిస్తున్న తారక్ - క్లైమాక్స్ ని ఎమోషనల్ సీన్స్ తోనే కట్టిపడేస్తున్నారట. సాధారణంగా సైకాలజీపై బేస్ అయిన మూవీస్ ని తీయడంలో దిట్ట డైరెక్టర్ సుకుమార్. కానీ సైకాలజీ లెవెల్స్ పరిధులు దాటిపోయిన మహేష్ 1 నేనొక్కడినే మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. అయినా సరే.. ఈ మూవీలో ఎన్టీఆర్ తో హృదయాన్ని కదిలించే సన్నివేశాలు - సంభాషణలు తీశాడట సుకుమార్. ముఖ్యంగా ఎన్టీఆర్ - జగపతిబాబుల మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడం గ్యారంటీ అంటున్నారు. సినిమా నుంచి బయటకు వచ్చే ప్రతీ ప్రేక్షకుడు బరువెక్కిన గుండెతో బయటకు రావాల్సిందే అని తెలుస్తోంది.

ఇలాంటి సీన్స్ ను పండించడంలో ఎన్టీఆర్ - జగపతిబాబులు ఎవరికి వారే రెచ్చిపోయి చేసేస్తారు. మరి ఇద్దరు కలిసి సెంటిమెంట్ పండించడమంటే.. ఇక పీక్ స్టేజ్ అన్నమాటే. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ మూవీలో.. ఓ పాటను మాత్రం రికార్డ్ చేయాల్సి ఉంది. దీన్ని యంగ్ టైగర్ స్వయంగా పాడనుండడం విశేషం. మరోవైపు జనవరి 13న రిలీజ్ విషయంలో కూడా ఇంకా టీంలో కన్ఫ్యూజన్ కొనసాగుతోంది.