Begin typing your search above and press return to search.
సైరా: బాహుబలి స్థాయి ఎమోషన్స్ ఉన్నాయా?
By: Tupaki Desk | 19 Sep 2019 6:29 AM GMTఒక సినిమా విజయానికి చాలా కారణాలు ఉంటాయి కానీ అందులో ముఖ్యమైనది కథ కథనం. అయితే కథా కథనాలు బాగుంటే సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది కానీ సక్సెస్ భారీస్థాయిలో ఉండదు. దానికి కావాల్సింది ప్రేక్షకుల హృదయాలను కదిలించే ఎమోషన్స్. రాజ్ కుమార్ హీరాని సినిమాలు ఎవైనా తీసుకోండి.. అందులో ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయి. ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతాయి. అందుకే ఆయన సినిమాలు భారీ విజయాలు సాధిస్తాయి. ఇక్కడే కాదు హాలీవుడ్ సినిమాలను తీసుకున్నా అదే అంశం కనిపిస్తోంది. 'అవతార్' సినిమాలో కూడా ఎమోషన్స్ కు పెద్దపీట ఉంటుంది.
ఇక మన టాలీవుడ్ లో భారీ సినిమాల గురించి మాట్లాడుకుంటే బాహుబలి రెండు భాగాలు ఆ రేంజ్ విజయం సాధించడానికి కారణం ముఖ్యంగా తారాస్థాయిలో ఉండే ఎమోషన్స్. నిజానికి రాజమౌళి సినిమాలు అన్నిటిలో అది చాలా సహజంగా ఉండే అంశం. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రభాస్ సినిమా 'సాహో' తీసుకుంటే ఆ సినిమాలో అసలేమాత్రం లేనివి.. ఒకవేళ ఉన్నప్పటికీ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయినవి ఎమోషన్స్. నిజానికి ఆ సినిమా ఫ్లాప్ గా ముద్ర వేయించుకోవడానికి ప్రధాన కారణం అదేని చాలామంది విమర్శకులు తేల్చారు.
ఇక టాలీవుడ్ లో రాబోతున్న మరో భారీ చిత్రం మెగాస్టార్ చిరంజీవి 'సైరా' ట్రైలర్ నిన్నే రిలీజ్ అయింది. 'సైరా' లో ఎమోషన్ కంటెంట్ ఉందని.. ప్రచారం సాగుతోంది కానీ ట్రైలర్ మాత్రం అంత ఎమోషనల్ గా ఏమీ కనిపించలేదని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. విజువల్స్ లో భారీతనం.. ఖర్చు.. అద్భుతమైన ఆర్ట్ వర్క్ అన్నీ ఉన్నా ఎమోషన్ మాత్రం పెద్దగా కనిపించడం లేదని అంటున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం 'బాహుబలి' తరహాలోనే 'సైరా' లో దర్శకుడు సురేందర్ రెడ్డి మంచి ఎమోషనల్ కంటెంట్ ను పెట్టారని.. అది ప్రేక్షకులను మెప్పించడం ఖాయమనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.