Begin typing your search above and press return to search.
గుమ్మడి వరలక్ష్మీ కి 'టక్ జగదీష్' బర్త్ డే విషెస్..!
By: Tupaki Desk | 10 March 2021 5:30 AM GMTనేచురల్ స్టార్ నాని - రీతు వర్మ - ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ''టక్ జగదీష్''. ‘నిన్ను కోరి’ ‘మజిలీ’ వంటి సున్నితమైన ప్రేమకథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి - హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు హీరోయిన్ రీతూ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది.
ఈ పోస్టర్ లో రీతూ వర్మ నుదుటిన సింధూరం పెట్టుకొని నాని ని చూసి ఎమోషనల్ అయినట్లు కనిపిస్తోంది. ఇందులో రీతూ 'గుమ్మడి వరలక్ష్మీ' అనే పాత్రలో నటిస్తోంది. జగదీష్ నాయుడితో గుమ్మడి వరలక్ష్మీ చేసే రొమాన్స్ ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా నిలుస్తుందని తెలుస్తోంది. ఏదేమైనా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన వీడియోలో రీతూని మిస్ చేసిన మేకర్స్.. ఇప్పుడు స్పెషల్ పోస్టర్ తో బ్యాలెన్స్ చేశారు.
ఇదిలావుండగా 'టక్ జగదీష్' చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 23న విడుదల చేయనున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నాని అన్నగా సీనియర్ హీరో జగపతి బాబు.. తండ్రిగా నాజర్ కనిపించనున్నారు. డేనియల్ బాలాజీ - ప్రియదర్శి - తిరువీర్ - రోహిణి - ప్రవీణ్ ఇతర పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.